ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ బైలా వర్తిస్తుందో తేలుస్తాం: హైకోర్టు

ABN, First Publish Date - 2022-12-16T01:34:48+05:30

ఏపీ హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌(ఏపీహెచ్‌సీఏఏ) నూతన ఎగ్జిక్యూటివ్‌ బాడీకి ఎన్నిక నిర్వహించే విషయంలో ఏ బైలా ప్రకారం నడుచుకోవాలో తేలుస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీహెచ్‌సీఏఏ ఎన్నికలపై విచారణ 21కి వాయిదా

అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌(ఏపీహెచ్‌సీఏఏ) నూతన ఎగ్జిక్యూటివ్‌ బాడీకి ఎన్నిక నిర్వహించే విషయంలో ఏ బైలా ప్రకారం నడుచుకోవాలో తేలుస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఏపీ బార్‌ కౌన్సిల్‌ అన్వయించుకున్న మోడల్‌ బైలా వర్తిస్తుందా? లేక ఏపీహెచ్‌సీఏఏ రిజిస్ట్రర్‌ బైలా వర్తిస్తుందా? అనే విషయాన్ని తేలుస్తామంది. దీనిపై స్పష్టత లేకుంటే భవిష్యత్తులో ఈ సమస్య పునరావృతమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో అదనపు వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఇరువైపుల న్యాయవాదులను ఆదేశించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎన్‌. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఏపీహెచ్‌సీఏఏ ఎగ్జిక్యూటివ్‌ బాడీ కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించక పోవడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది ఎన్‌.విజయ్‌భాస్కర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సింగిల్‌ జడ్జి నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏపీహెచ్‌సీఏఏ అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, కార్యదర్శి కె.నర్సిరెడ్డి ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. ఈ అప్పీల్‌ గురువారం విచారణకు వచ్చింది.

Updated Date - 2022-12-16T01:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising