ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా ఆటో డ్రైవర్‌కు వేధింపులు.. ABN జోక్యం.. ధైర్యం చెప్పిన సీఐ

ABN, First Publish Date - 2022-05-28T17:55:33+05:30

జిల్లాలో మహిళా ఆటో డ్రైవర్ పట్ల తోటి ఆటో డ్రైవర్లు అరాచకానికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలో మహిళా ఆటో డ్రైవర్ పట్ల తోటి ఆటో డ్రైవర్లు అరాచకానికి పాల్పడ్డారు. మాంగళ్య షాపింగ్ మాల్ స్టాండ్‌లో ఆటో పెట్టుకోవద్దంటూ మహిళా ఆటోడ్రైవర్ విజయను తోటి ఆటో డ్రైవర్లు బెదిరించారు. ‘‘ఏం చేస్తామో తెలియదు... మా కంటికి కనపడవద్దు’’ అంటూ హెచ్చరించారు. దీంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ఆశ్రయించిన విజయ... తన గోడును వెల్లబోసుకుంది. భర్తను కోల్పోయి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నానని...  కూరగాయల వ్యాపారంలో నష్టం రావడంతో నాలుగు లక్షలు అప్పు చేసి ఆటో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఆటో డ్రైవర్ల నుంచి తనను కాపాడాలంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి విజయ కోరారు. మహిళా డ్రైవర్ ఆవేదన, ఆటో డ్రైవర్ల ఆరాచకాన్ని సీఐ జాకీర్ హుస్సేన్ దృష్టికి ఏబీన్ ఆంధ్రజ్యోతి తీసుకువెళ్లింది. అన్ని విధాలా రక్షణ కల్పించడంతో పాటు ఆటో డ్రైవర్లపై చర్య తీసుకుంటామంటూ మహిళ ఆటో డ్రైవర్ విజయకు సీఐ జాకీర్ హుస్సేన్ ధైర్యం చెప్పారు. 

Updated Date - 2022-05-28T17:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising