ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palnadu Politics: అధికార పార్టీలో తీవ్రస్థాయికి వర్గపోరు... ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తీరుతో హైటెన్షన్

ABN, First Publish Date - 2022-08-30T00:34:45+05:30

గురజాల నియోజకవర్గంలో (Gurjala constituency) వైసీపీ వర్గ పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ( MLA Kasu Mahesh Reddy), ఎమ్మెల్సీ జంగాకృష్ణమూర్తి (MLC Jangakrishna Murthy) మధ్య నెలకొన్న విభేదాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: గురజాల నియోజకవర్గం (Gurajala constituency) వైసీపీలో వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరింది.ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ( MLA Kasu Mahesh Reddy), ఎమ్మెల్సీ జంగాకృష్ణమూర్తి  (MLC Jangakrishna Murthy) మధ్య నెలకొన్న విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇటీవలే శాసనమండలి విప్‌గా జంగా కృష్ణమూర్తి ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామంలో జంగా అభిమానులు అభినందన సభ ఏర్పాటు చేశారు. అయితే జంగా అభినందన సభకు వెళ్లకూడదని అభిమానులను ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ఆదేశించారు. ఆయన ఆదేశాలను లెక్క చేయకుండా జంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో మున్సిపల్ సిబ్బంది తీరుపై జంగా అభిమానులు మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతో తమ ఫ్లెక్సీలను తొలగించారని ఆరోపించారు. 


ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ రేవతి.. ఎమ్మెల్యే కాసు వర్గం మధ్య ఘర్షణ జరిగింది. నడి రోడ్డుపైనే ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. తాజాగా ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య గ్రూపు రాజకీయాలు తలెత్తడం గురజాల నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. 



Updated Date - 2022-08-30T00:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising