ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ గడపలకేనా.. టీడీపీ గడపలకు రారా..!

ABN, First Publish Date - 2022-12-16T00:50:19+05:30

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కేవలం వైసీపీ గడపలకేనా వెళ్లేది.. మా గడపలకు రారా అంటూ వార్డు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురజాల టౌన్‌, డిసెంబరు 15: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కేవలం వైసీపీ గడపలకేనా వెళ్లేది.. మా గడపలకు రారా అంటూ వార్డు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం పట్టణంలోని 16వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాసు మహే్‌షరెడ్డి నిర్వహిస్తుండగా తమ సమస్యలు చెప్పుకునేందుకు వృద్ధులు, మహిళలు అక్కడకు వెళ్లారు. అయితే 16వ వార్డు కౌన్సిలర్‌ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో వైసీపీ కుటుంబాల వద్దకు మాత్రమే వెళ్లి టీడీపీ గృహాలకు వెళ్లకపోవడంతో వైసీపీ గడపలకు తప్ప టీడీపీ గడపలకు రారా అంటూ ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం అని కాకుండా వైసీపీ గడపలకు పరామర్శ అని పెడితే బాగుంటుందని విమర్శించారు. వార్డులో సమస్యలు వింటే కదా తెలిసేది అలా వచ్చి వెళ్తే ఏం తెలుస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకుందామని ఎమ్మెల్యే దగ్గరకు వస్తే త్వరలోనే పరిష్కరిస్తామని అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు ఇదేనా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అంటూ మండి పడుతున్నారు.

16వ వార్డులో జరిగిన గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధరరెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ పవన్మయి వీరారెడ్డి, వైస్‌ చైర్మన్‌ బడేజాని, రాష్ట్ర పౌర సరఫరాల డైరెక్టర్‌ కర్ర ప్రగతి కోటేశ్వరరావు, ఎంపీపీ కొమ్మినేని నారాయణమ్మ, బుజ్జి, మండల కన్వీనర్‌ గాంధీ, నాసర్‌సైదా, కర్రా గిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:50:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising