గెలుపు జెండా ఎగరాల్సిందే..
ABN, First Publish Date - 2022-10-07T05:59:45+05:30
దాడులు, బెదిరింపులు, అక్రమ కేసుల బనాయింపులు వంటి ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ప్రజా మద్దతుతో వాటన్నింటినీ అధిగమించి నియోజకవర్గంలో టీడీపీ గెలుపు జెండాను ఎగురవేయాల్సిందే’ అని టీడీపీ అధినేత నారా చంద్ర బాబునాయుడు టీడీపీ గురజాల నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు స్పష్టంచేశారు.
చంద్రబాబుతో మాజీ ఎమ్మెల్యే యరపతినేని
పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక భేటి
గురజాల నియోజకవర్గంలో పార్టీ స్థితిపై సమీక్ష
పిడుగురాళ్ల, అక్టోబరు6: ‘దాడులు, బెదిరింపులు, అక్రమ కేసుల బనాయింపులు వంటి ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ప్రజా మద్దతుతో వాటన్నింటినీ అధిగమించి నియోజకవర్గంలో టీడీపీ గెలుపు జెండాను ఎగురవేయాల్సిందే’ అని టీడీపీ అధినేత నారా చంద్ర బాబునాయుడు టీడీపీ గురజాల నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు స్పష్టంచేశారు. అలాగే ప్రభుత్వ పనితీరుపై ప్రస్తుతం అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌ తుందని, ఆ వ్యతిరేకతకు కారణమైన అంశాలను ప్రచారాస్ర్తాల్లా మలు చుకొని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, తద్వారా ప్రభుత్వంపై మరింత ప్రజావ్యతిరేక ఒత్తిడి పెరిగేలా చూడాలని యరపతినేనికి సూచించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో యరపతినేని చంద్ర బాబును కలిశారు. ఈసందర్భంగా గురజాల నియోజకవర్గంలో పార్టీ స్థితి గతులపై వారు సమీక్షించారు. ఏయే వర్గాల ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారో చెప్పటంతోపాటు వైసీపీ నేతల ఒత్తిళ్లు, అక్రమ కేసుల బనాయింపు లాంటి సంఘటనలు జరుగుతున్నా సభ్యత్వ నమోదులో రాష్ట్రస్థాయిలో గురజాలను రెండో స్థానంలో నిలిపినందుకు చంద్రబాబునాయుడు యరపతినేనిని అభినందించారు. గురజాల నుంచి ప్రతి మూడు నెలల కొకసారి నివేదికలు తెప్పించుకుంటు న్నానని, పార్టీ పనితో పాటు కార్యకర్తలకు అండగా ఉంటున్న తీరు చాలా బాగుందని, మున్ముందూ పార్టీ కేడర్‌కు అండగా ఉండాలని, అలాగే ప్రతి గ్రామంలో పల్లె పిలుస్తుంది కార్యక్రమానికి మంచి మైలేజ్ కనిపిస్తుందని, ఆ కార్యక్ర మాన్ని కొనసాగిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని చంద్రబాబు యరపతినేనికి దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో గురజాల సీటు టీడీపీ గెలిచి తీరుతుందని చంద్ర బాబు ధీమా వ్యక్తంచేశారు. రాజధాని అమరావతి తరలింపు అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలని యరపతినేనికి సూచించారు. పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై అఽధికార పార్టీ చేస్తున్న అరాచకాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతూ వారికి అండగా ఉంటున్న యరపతినేని పనితీరును ప్రశంసిస్తూనే, అన్ని సర్వేలు నియోజక వర్గంలో టీడీపీ గెలుపుకు అనుకూలంగా ఉన్నా యని, ఇదే ఒరవడిని కొనసాగించాలని చంద్రబాబునాయుడు మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో ప్రస్తావించారు.
Updated Date - 2022-10-07T05:59:45+05:30 IST