ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News.. జగన్ ప్రభుత్వం ఉన్మాదంగా వ్యవహరిస్తోంది: యరపతినేని

ABN, First Publish Date - 2022-10-17T18:05:06+05:30

వైఎస్ జగన్ ప్రభుత్వం (YCP Govt.) అరాచంగా, ఉన్మాదంగా వ్యవహరిస్తోందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా (Guntur): వైఎస్ జగన్ ప్రభుత్వం (YCP Govt.) అరాచంగా, ఉన్మాదంగా వ్యవహరిస్తోందని, తాలిబన్ల తరహాలో పాలన సాగిస్తోందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు (Yarapatineni Srinivasarao) విమర్శించారు. టీడీపీ మీడీయా సమన్వయకర్త దారపనేని నరేంద్ర (Darapuneni Narendra)ను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం (Ambedkar Constitution) కాకుండా ముఖ్యమంత్రి తాత రాజారెడ్టి (Raja reddy) రాజ్యాంగం అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేసి వేధిస్తున్నారని, ఏమీ లేని కేసుల్లో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రిటైరైన పోలీసు అధికారులను మళ్లీ సిఐడి నియమించికుని వారితో ఇలాంటి అరెస్టులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్థిక ఉగ్రవాది చెప్పినట్లు సిఐడి అధికారులు (CID officials) చేస్తున్నారని, కోర్టు బెయిల్‌తో బయట తిరుగుతున్న వ్యక్తి ఇలాంటి పనులు చేయిస్తున్నారని విమర్శించారు. తర్వాత కాలంలో అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నా.. బెయిల్ రద్దు అయితే ఆయన వెళ్లి జైల్లో కూర్చుంటారని, అప్పుడు ఇబ్బంది పడేది నేతలు, కార్యకర్తలేనని యరపతినేని అన్నారు. 

Updated Date - 2022-10-17T18:05:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising