ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీలే లక్ష్యంగా వైసీపీ దాడులు

ABN, First Publish Date - 2022-12-15T00:45:11+05:30

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలే లక్ష్యంగా వైసీపీ దాడులు చేస్తుందని, అక్రమ కేసులు, హత్యలతో వారిని పొట్టన పెట్టుకుంటుందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.

పిడుగురాళ్లలో బీసీ శంఖారావం సభకు ర్యాలీగా వెళ్తున్న యరపతినేని, బీసీ సామాజికవర్గ నేతలు, యువత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్యాధికారం కల్పించిన ఘనత టీడీపీదే

శంఖారావంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని

పిడుగురాళ్ల, డిసెంబరు 14: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలే లక్ష్యంగా వైసీపీ దాడులు చేస్తుందని, అక్రమ కేసులు, హత్యలతో వారిని పొట్టన పెట్టుకుంటుందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. పిడుగురాళ్లలో బుధవారం జరిగిన గురజాల నియోజకవర్గ స్థాయి బీసీ శంఖారావంలో ఆయన ప్రసంగించారు. పేరుకు బీసీలపై ప్రేమ ఉందంటూ చెప్పటమే కానీ వైసీపీ నేతలు వాస్తవంగా ఆ సామాజిక వర్గాలను అణచివేతకు గురిచేస్తున్నారన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలిచిన బీసీ సామాజిక వర్గాన్ని ఆనాడు ఎన్టీఆర్‌ నుంచి ఈనాడు చంద్రబాబు వరకు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత టీడీపీదేనన్నారు. విజయవాడలో వైసీపీ జయహో బీసీ సభకి హాజరైన బీసీ నేతలకు అన్నం పెట్టకపోవడంతో వారు సమీపంలో ఉన్న అన్నా క్యాంటిన్‌లో భోజనం చేశారన్నారు. పేదలకి పట్టెడన్నం పెట్టేందుకు అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని మూసివేయించారన్నారు. ఎన్నికలు ఉన్నా, లేకున్నా టీడీపీ బీసీల పక్షానే నిలుస్తుందన్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి శాసనమండలి విప్‌ పదవి ఇస్తే ఆయన స్వగ్రామంలో అభిమానులు ఏర్పాటు చేసిన సభకు ఎవరిని వెళ్లనివ్వకుండా అడ్డంకులు సృష్టించింది కాసు మహేష్‌రెడ్డి కాదా అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌లో వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతి రోడ్డెక్కడమే కాకుండా వడ్డెర సామాజిక వర్గ యువకులను హత్యలు చేసింది వైసీపీ నేతలేనని బహిరంగంగా చెప్పడంపై ఏం సమాధానం చెప్తారన్నారు. మైనింగ్‌, రేషన్‌ మాఫియాతోపాటు అన్నీ సొంత సామాజిక వర్గానికే కాసు కట్టబెడుతున్నారని తెలిపారు. కష్టాల్లో ఉన్న కుందుర్తి గురవాచారికి ఆనాడు తాను రూ.లక్షతో పాటు ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగ అవకాశాన్ని కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.

Updated Date - 2022-12-15T00:45:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising