ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రబలిన విషజ్వరాలు

ABN, First Publish Date - 2022-03-16T05:35:46+05:30

మండలంలోని బాలేమర్రు గ్రామంలో రెండు మూడు రోజుల నుంచి విషజ్వరాలు ప్రబలుతున్నాయి

వైద్య సిబ్బందికి సూచనలు చేస్తున్న డీఎంహెచ్‌వో జే యాస్మిన్‌, డీపీవో కేశవరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలేమర్రులో 50మందికి పైగా బాధితులు

గ్రామాన్ని సందర్శించిన జిల్లా అధికారుల బృందం 

క్రోసూరు, మార్చి 15: మండలంలోని బాలేమర్రు గ్రామంలో రెండు మూడు రోజుల నుంచి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గ్రామంలో 50 మంది వరకు జ్వరపీడితులు ఉన్నట్టుగా స్థానికులు చెపుతున్నారు. వీరిలో కొంతమందికి డెంగీ జ్వరం లక్షణాలు ఉన్నట్టు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారుల బృందం మంగళవారం గ్రామాన్ని సందర్శించింది. డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ ఆధ్వర్యంలో డీపీవో ఆర్‌.కేశవరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ ఆర్‌ఎస్‌ఆర్‌ సురేష్‌, మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి ప్రభాకరరెడ్డి తదితరులు తదితరులు గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రానికి వచ్చారు.  స్థానిక వైద్య ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామంలో జ్వరపీడితుల నుంచి రక్త నమూనాలు, మంచి నీటి నమూనాలు స్వీకరించారు. జ్వరాలు తగ్గేవరకు గ్రామంలో మెడికల్‌ క్యాంపు నిర్వహించాలని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ బాల అంకమ్మబాయిని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ ఈఈ అబ్దుల్‌ మతిన్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ రత్నబాబు, క్రోసూరు ఎంపీడీవో పి.బాలమ్మ, ఈవోపీఆర్‌డీ బి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-03-16T05:35:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising