ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజ్ఞాన్‌ వర్సిటీలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

ABN, First Publish Date - 2022-01-13T06:26:46+05:30

సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని వారికష్టాలను యువత గుర్తెరిగి చేయూత ఇవ్వాలని విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావురత్తయ్య పేర్కొన్నారు.

వేడుకల్లో పాల్గొన్న డాక్టర్‌ లావు రత్తయ్య, విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య), జనవరి 12: సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని వారికష్టాలను యువత గుర్తెరిగి చేయూత ఇవ్వాలని విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావురత్తయ్య పేర్కొన్నారు.  చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. సంక్రాంతి పర్వదిన వేళ గ్రామీణ  ప్రాంతాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయని, రైతు ఇంటికి  ధాన్య సిరులు వచ్చేది సంక్రాంతికేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హరిదాసు కీర్తనలు, రంగవల్లులు, కోలాటాలలతో తెలుగు సంస్కృతి, గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా   వేడుకల్ని నిర్వహించారు.

విజ్ఞాన్‌ నిరులాలో..

స్థానిక పలకలూరు రోడ్డులోని విజ్ఞాన్‌ నిరులా ఇంజనీరింగ్‌ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ముగ్గులపోటీలు, గాలిపటాలు ఎగురవేసే పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పాతూరి రాధిక,అధ్యాపకులు  పాల్గొన్నారు.


Updated Date - 2022-01-13T06:26:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising