ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులపై నిర్బంధం

ABN, First Publish Date - 2022-08-04T05:41:16+05:30

సమాన పనికి సమాన వేతనంతో పాటు పలు సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు బుధవారం తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులను వెళ్లనీయకుండా ఆశాఖ అధికారులు నిర్బంధం ప్రయోగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఛలో విజయవాడను అడ్డుకునేలా చర్యలు

ఉదయాన్నే విధుల్లోకి వెళ్ళాలంటూ ఆపరేటర్లకు ఆదేశాలు

సిబ్బందిపై తనిఖీలు చేయాలని ఆదేశాలు

గుంటూరు, ఆగస్టు 3: సమాన పనికి సమాన వేతనంతో పాటు పలు సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు బుధవారం తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులను వెళ్లనీయకుండా ఆశాఖ అధికారులు నిర్బంధం ప్రయోగించారు. విజయవాడలో ఏర్పాటుచేసిన కార్మికుల రాష్ట్ర స్థాయి సదస్సును భగ్నం చేసేందుకు జిల్లా విద్యుత్‌ శాఖ అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు. ఛలో విజయవాడను అడ్డుకోవాలని ఉన్నతాధికారుల నుంచి దిగువ అధికా రులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపించారు. దాంతో ఏపీ ట్రాన్స్‌కో, సీపీడీసీఎల్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిపై నిర్భంధానికి పూనుకున్నట్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రోజులో మూడు విడతలుగా నిర్వహించే సబ్‌ స్టేషన్‌లలో షిఫ్ట్‌ ఆపరేటర్లను ముగ్గురిని బుదవారం ఉదయం సబ్‌ స్టేషన్‌లో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఉద్యోగులు తెలిపారు. సబ్‌ స్టేషన్‌లలో మెయింట్‌నెన్స్‌లో భాగంగా గడ్డి పీకటం, ఇతర వ్యర్ధాలు తొలగించే పనులు చేచేస్తున్న ఫోటోలు తీసి ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశించారు. ఆయా ఉద్యోగుల పనితీరును పర్యవేక్షిం చాలని కిందిస్థాయి అధికారు లకు బాధ్యతలు అప్పగింటచంపై ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. ఇదే పనిని మంగళ, బుధవారంతో పాటు గురువారం కూడా చేయా లంటూ ఆదేశాలొచ్చాయని చెబుతున్నారు. ఇక సెక్షన్‌ కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులతో చెట్ల కొమ్మలు నరికించటం, ట్రాన్స్‌ ఫార్మర్ల నిర్వహణ వంటి పనులు చేయించినట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ నిర్భందాలను లెక్కచేయకుండా కొందరు ఉద్యోగులు ఛలో విజయవాడకు తరలివెళ్ళారు. హామీలను నెరవేర్చేవరకు ఆందోళనలు.. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని ఏపీ విద్యుత్‌ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈనెల నుంచి సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విజయవాడకు వెళ్లిన ఉద్యోగులపై ఆరా.. నిర్భందాలను సైతం లెక్క చేయకుండా ఛలో విజయవాడకు వెళ్లిన కాంటాక్టు ఉద్యోగులపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఆయా ఉద్యోగుల వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అందటంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-08-04T05:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising