ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రకరకాల నిబంధనలు.. లెక్కలేనన్ని కోతలు: Chandra Babu

ABN, First Publish Date - 2022-06-27T22:00:57+05:30

Amaravathi: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandra Babu Naidu) సీఎం జగన్‌ (Jagan)పై విరుచుకుపడ్డారు. సంక్షేమ పథకాల వర్తింపులో రకరకాల నిబంధనలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandra Babu Naidu)  సీఎం జగన్‌ (Jagan)పై విరుచుకుపడ్డారు. సంక్షేమ పథకాల వర్తింపులో రకరకాల నిబంధనలతో కోతులు పెడుతూ.. ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎన్ని ఎత్తులు వేసినా..వైసీపీకి ఓట్ల శాతం పెరగలేదు.

‘‘అమ్మఒడి పథకంలో 52 వేలమంది లబ్దిదారులు తగ్గారు. ఒంటరి మహిళకు ఇచ్చే పింఛన్లో నిబంధనలు మార్చారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని జగన్‌కు రాజధాని భూమలు అమ్మే హక్కు ఎక్కడిది? అమరావతిని శ్మశానంతో పోల్చిన  ఈ ప్రభుత్వం... ఇప్పుడు ఎకరా రూ. 10 కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుంది? ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చెయ్యకుండా...ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వజూపడం అన్యాయం. డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకున్నా ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీకి ఓట్లు పెరగలేదు. ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆత్మకూరు ఉపపోరు ఫలితాల్లో కనిపించింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే మద్యం నాణ్యతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిధుల్లేక దుల్హన్ పథకాన్ని నిలిపివేశామని హైకోర్టుకు చెప్పడం జగన్ రెడ్డి మోసానికి నిదర్శనం. ఈ-క్రాప్ నమోదులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తల పేర్లు నమోదు చేసి.. పంట నష్టపోయిన రైతులకు మొండిచేయి చూపారు.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2022-06-27T22:00:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising