ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్దేశిత ధ్రువపత్రాలు అప్‌లోడ్‌ చేయకుంటే చర్యలు

ABN, First Publish Date - 2022-12-15T00:45:41+05:30

నగరంలో నూతన బహుళ అంతస్తు నిర్మాణాలకు లైసెన్స్‌ టెక్నికల్‌ పర్సన్స్‌ (ఎల్‌టీపీ)లు తప్పనిసరిగా నిర్దేశిత ధ్రువపత్రాలతోనే డీపీఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీఎంసీ కమిషనర్‌ కీర్తి చేకూరి

గుంటూరు (కార్పొరేషన్‌) డిసెంబరు 14: నగరంలో నూతన బహుళ అంతస్తు నిర్మాణాలకు లైసెన్స్‌ టెక్నికల్‌ పర్సన్స్‌ (ఎల్‌టీపీ)లు తప్పనిసరిగా నిర్దేశిత ధ్రువపత్రాలతోనే డీపీఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్‌ గోరంట్ల, ఉద్యోగనగర్‌ తదితర ప్రాంతాల్లో ఎన్‌వోసీకి దర ఖాస్తు చేసుకున్న భవనాలను లేజర్‌ మెజరింగ్‌ మెషిన్‌ ద్వారా పరిశీలించి పట్టణ ప్రణాళిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నిబందనలకు విరుద్థంగా అప్‌లోడ్‌ చేసే ఎల్‌టీపీ ల లైసెన్స్‌ రద్దుకు చర్యలు తీసుకుంటామన్నారు. మాస్టర్‌ప్లాన్‌కు అనుగు ణంగానే భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలని, లేని వాటిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాలిక అధికారులను ఆదేశించారు. పర్యటనలో సిటీ ప్లానర్‌ మూర్తి, ఏసీపీలు అజయ్‌కుమార్‌, బాబురావు, టీపీఎస్‌లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

నూతన వలంటీర్లు రేపటి నుంచి విధులకు హాజరుకావాలి

నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డు వలంటీర్ల పోస్టులకు బుధవారం డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాస రావు, టి.వెంకటకృష్ణయ్యలు ఇంటర్వ్యూలు నిర్వహించారని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ దరఖాస్తుల పరిశీలన అనంతరం 64 మందిని అర్హులుగా ప్రకటించగా వారిలో 41 మంది ఇంటర్వ్యూకి హాజరయ్యారని తెలిపారు. వలంటీర్లుగా ఎంపికైన వారి ఫోన్‌కి మెసేజ్‌ వస్తుందని, వారు ఈ నెల 16 నుంచి విధు ల్లో చేరవలసి ఉంటుందని తెలిపారు.

Updated Date - 2022-12-15T00:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising