ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిక్కుడు తోటకు నిప్పు

ABN, First Publish Date - 2022-05-26T05:50:39+05:30

చేతికి అందివచ్చిన చిక్కుడు పంటకు వైసీపీ నాయకుడు నిప్పంటించారని, తద్వారా తనకు రూ.3.50 లక్షల పంటనష్టం వాటిల్లిందని మండలం లోని తుంగపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేత, రైతు ఈదర సీతారామయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పూర్తిగా కాలిపోయిన చిక్కుడు చేను
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ నాయకుడి దాష్టీకం 

పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

రొంపిచర్ల, మే 25 : చేతికి అందివచ్చిన చిక్కుడు పంటకు వైసీపీ నాయకుడు నిప్పంటించారని, తద్వారా తనకు రూ.3.50 లక్షల పంటనష్టం వాటిల్లిందని మండలం లోని తుంగపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేత, రైతు ఈదర సీతారామయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవిషయంపై సీతారామయ్య విలేకర్లతో మాట్లాడుతూ.. తుంగపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఏనుగంటి వెంకటరావు మంగళవారం సాయంత్రం తన చిక్కుడు తోటకు నిప్పంటించాడనీ, తద్వారా తనకు సుమారు సుమారు రూ.3.50 లక్షల పంట నష్టం వాటిల్లిందని అని సీతారామయ్య  పేర్కొన్నాడు.  ఈ ఘటన పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారెవరూ స్పందించ లేదని ఆరోపించాడు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ  తుంగపాడు గ్రామంలో వైసీపీ నాయకులు తమ ఆగడాలు ఆపకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 


Updated Date - 2022-05-26T05:50:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising