ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప తహసీల్దార్ల బదిలీ

ABN, First Publish Date - 2022-07-04T06:03:02+05:30

రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల్లో ఉప తహసీల్దార్ల బదిలీలు జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన స్థానచలనం

డీటీలకు వ్యక్తిగతంగా పోస్టింగ్స్‌ ఆదేశాలు

గుంటూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల్లో ఉప తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాతిపదికన జరిగిన ఈ బదిలీల్లో దీర్ఘకాలంగా ఒకేచోట కొనసాగుతున్న వారిని వేరే మండలాలకు బదిలీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో పల్నాడు, బాపట్ల జిల్లాలకు వెళ్లిన కొందరు వెనక్కు తిరిగి వచ్చేశారు. ప్రధానంగా పౌరసరఫరాల శాఖలో దీర్ఘకాలంగా ఉంటున్న వారిని ఎట్టకేలకు కదిలించారు. వ్యక్తిగతంగా డీటీలకు పోస్టింగ్స్‌ ఆదేశాలను అందజేశారు. అవి ఆదివారం వెలుగులోకి వచ్చాయి.  

గుంటూరు ఎలక్షన్‌ డీటీ జీ సుధాకిరణ్మయిని చేబ్రోలు డీటీగా, తుళ్లూరు డీటీ యూ రాజేష్‌ని కాకుమానుకు, పల్నాడు సివిల్‌ సప్లయిస్‌ స్పెషల్‌ డీటీ సీవీఎల్‌ఫణికుమార్‌ని పొన్నూరు ఎలక్షన్‌ డీటీగా, గుంటూరు భూసంస్కరణల స్పెషల్‌ డీటీ సీహెచ్‌ అనంతలక్ష్మిని మంగళగిరి డీటీగా, ప్రత్తిపాడు ఎలక్షన్‌ డీటీ కేవీ శ్రీనివాస్‌ని పల్నాడు పౌరసరఫరాలశాఖ స్పెషల్‌ డీటీగా, మంగళగిరి డీటీ షేక్‌ మీరావలిని గుంటూరు ఎల్‌ఆర్‌స్పెషల్‌ డీటీగా, గుంటూరు డీఎస్‌వో ఆఫీసు స్పెషల్‌ డీటీ కే భువనేశ్వరిని పొన్నూరు సీఎస్‌డీటీగా నియమించారు. పిడుగురాళ్ల సీఎస్‌డీటీ పీ దుర్గారావుని మంగళగిరి సీఎస్‌డీటీగా, బాపట్ల డీఎస్‌వో ఆఫీస్‌ స్పెషల్‌ డీటీ ఎస్‌ఏ శివలీలని తెనాలి-1 జీపీఏగా, గుంటూరు డీఎస్‌వో ఆఫీసు స్పెషల్‌ డీటీ కేవీరాజేష్‌ని తెనాలి-2 జీపీఏగా పోస్టింగ్‌ చేస్తూ గుంటూరు కలెక్టరేట్‌లో వర్కింగ్‌ అరేంజ్‌మెంట్స్‌ కింద బాధ్యతలు కల్పించారు. తెనాలి-2 జీపీఏ బీ శారదాదేవిని గుంటూరు డీఎస్‌వో ఆఫీసు ఎస్‌డీటీగా, చిలకలూరిపేట ఎలక్షన్‌ డీటీ ఏవీ సురేష్‌కుమార్‌ని గుంటూరు డీఎస్‌వో ఆఫీసు స్పెషల్‌ డీటీగా నియమిస్తూ వర్కింగ్‌ అరేంజ్‌మెంట్స్‌ కింద జేసీ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు కేటాయించారు. 

బాపట్ల జీపీఏ కే గోపికృష్ణని గుంటూరు డీఎస్‌వో ఆఫీసు స్ఫెషల్‌ డీటీగా, డాక్టర్‌ కేఎల్‌రావు సాగర్‌ పులిచింతల ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఎస్‌డీటీగా ఉన్న కే స్వప్నరెడ్డిని గుంటూరు డీఎస్‌వో ఆఫీసులో ఎస్‌డీటీగా నియమిస్తూ వర్కింగ్‌ అరేంజ్‌మెంట్స్‌ కింద మీసేవ ఏవోగా బాధ్యతలు కేటాయించారు. పల్నాడు డీఎస్‌వో ఆఫీసు ఎస్‌డీటీ టీ రమాదేవిని గుంటూరు డీఎస్‌వో ఆఫీసులో ఎస్‌డీటీగా పోస్టింగ్‌ చేసి వర్కింగ్‌ అరేంజ్‌మెంట్స్‌ కింద కలెక్టరేట్‌లో బాధ్యతలు కేటాయించారు. పల్నాడు డీఎస్‌వో ఆఫీసు ఎస్‌డీటీ ఏ శ్రీనివాసరావుని గుంటూరు డీఎస్‌వో ఆఫీసులో డివిజనల్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ డీటీగా నియమిస్తూ కలెక్టరేట్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. క్రోసూరు సీఎస్‌డీటీ ఎస్‌ శ్యామలతని యడ్లపాడు డీటీగా, యడ్లపాడు డీటీ బీ నిర్మలని క్రోసూరు సీఎస్‌డీటీగా, గుంటూరు సీఎస్‌డీటీ ఎండీ జియావుల్‌హక్‌ని పెదకూరపాడు ఎలక్షన్‌ డీటీగా, గుంటూరు డివిజనల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ ఎన్‌ దుర్గేశ్వర రావుని చిలకలూరిపేట ఎలక్షన్‌ డీటీగా, మంగళగిరి సీఎస్‌డీటీ కే అరుణదేవిని పిడుగురాళ్ల సీఎస్‌డీటీ, పిడుగురాళ్ల జీపీఏ షేక్‌ సల్మాన్‌ని నరసరావుపేట-2 జీపీఏగా, పౌరసరఫరాల సంస్థ డీఎం ఆఫీసు డీటీ జీ అంకారావుని పల్నాడు డీఎస్‌వో ఆఫీసులో ఎస్‌డీటీగా పోస్టింగ్‌ చేశారు. అచ్చంపేట డీటీ సీహెచ్‌వీ నాగేశ్వరరావుని కేఆర్‌ఆర్‌సీ డీటీ నరసరావుపేటగా, బాపట్ల డీటీ జీ శ్రీచరణ్‌ని కర్లపాలెం డీటీగా, కర్లపాలెం డీటీ పీ సాంబశివరావుని బాపట్ల డీటీగా, తెనాలి-1 జీపీఏ డీ రవీంద్రకుమార్‌ని బాపట్ల డీఎస్‌వో ఆఫీసులో ఎస్‌డీటీగా, పులిచింతల స్పెషల్‌ కలెక్టర్‌ ఆఫీసు ఎస్‌డీటీ పీ సురేష్‌ని బాపట్ల జీపీఏగా నియమించారు.



Updated Date - 2022-07-04T06:03:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising