ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది పరీక్షలకు.. సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2022-04-24T05:45:31+05:30

పది పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఈవో పి.శైలజ వెల్లడించారు. శనివారం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  డీఈవో కార్యాలయంలో ప్రత్యేక  సహాయకేంద్రం


గుంటూరు(విద్య), ఏప్రిల్‌ 23:  పది పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఈవో పి.శైలజ వెల్లడించారు. శనివారం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  వివరాలు వెల్లడించారు. ఫీజులు బకాయిలున్నాయని కొన్ని ప్రైవేటు స్కూల్స్‌ యాజమాన్యాలు  విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు నిలిపివేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఇటువంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు టెన్త్‌ పరీక్షలకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా  డీఈవో కార్యాలయంలో హెల్ప్‌లైన్‌ కేంద్రం (8985054732, 8341482595) ఏర్పాటు చేశామని  వెల్లడించారు. హాల్‌టిక్కెట్‌ను చూపి పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. విద్యార్థులు తమకు ఇచ్చిన హాల్‌టిక్కెట్‌పై ఫొటో సరిగా ప్రింట్‌ కాకుంటే హెచ్‌ఎంను సంప్రదించి మరో ఫొటో అతికించి అటెస్టేషన్‌ చేయించి పరీక్షకు హాజరుకావాలని తెలిపారు. ఓఎమ్మార్‌ షీట్‌ పూర్తిచేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షల్లో బుక్‌లెట్‌ మాత్రమే ఇస్తారని అదనపు పేపర్లు ఇవ్వరని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఇన్విజిలేటర్స్‌ ఫోన్స్‌ తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. సమావేశంలో పరీక్షల నిర్వహణ కమిషనర్‌ మాణిక్యాంబ, గుంటూరు ఎంఈవో ఖుద్దూస్‌, ఓపెన్‌స్కూల్స్‌ కోఆర్డినేటర్‌ రవి, ఉర్దూ డీఐ ఎస్‌కేఎండీ ఖాశిం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-24T05:45:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising