ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఎస్‌ రద్దు చేయాలని నిరసన

ABN, First Publish Date - 2022-05-18T05:21:59+05:30

పాత పెన్షన్‌ విధానం అమలు చేసి సీఎం జగన్మోహనరెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ప్యాప్టో) రాష్ట్ర చైర్మన్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు విజ్ఞప్తి చేశారు.

మూల్యాంకన కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఫ్యాప్టో నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూల్యాంకన కేంద్రం వద్ద ఫ్యాప్టో నాయకులు ధర్నా

గుంటూరు(విద్య), మే 17: పాత పెన్షన్‌ విధానం అమలు చేసి సీఎం జగన్మోహనరెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ప్యాప్టో) రాష్ట్ర చైర్మన్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గుంటూరులోని మూల్యాంకన కేంద్రం(స్టాల్‌ స్కూల్‌) వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జోసెఫ్‌ సుధీర్‌బాబు మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు చేయకుంటే  ఉపాధ్యాయుల ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. యూటీఎఫ్‌ అధ్యక్షుడు పి.ప్రేమ్‌కుమార్‌ మట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్ని నిర్వీర్యం చేసే ప్రక్రియకు స్వస్తి చెప్పాలన్నారు. ఏపటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు మాట్లాడుతూ స్పాట్‌ రేట్లు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతోపాటు ఉపాధ్యాయుల అపరిషృత సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారు. పీఆర్‌సీ బకాయిలు, అరియర్స్‌ వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు పెదబాబు, యూటీఎఫ్‌ నాయకులు ఎం.కళాధర్‌, ఏపీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్‌(1938) అధ్యక్షుడు మేకల సుబ్బారావు, సంపత్‌బాలు, యూటీఎఫ్‌ నాయకులు ఎం.హనుమంతరావు, చంద్రజిత్‌ యాదవ్‌, యు.రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-18T05:21:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising