ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ?

ABN, First Publish Date - 2022-05-19T05:13:31+05:30

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని, టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ ప్రశ్నించారు.

కార్యకర్తలతో మాట్లాడుతున్న తాడికొండ శ్రావణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకాయమ్మపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌

గుంటూరు(తూర్పు), మే 18: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని, టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ ప్రశ్నించారు.  బుధవారం తాడికొండ నియోజకవర్గ నాయకులతో స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ జగన్‌ పరిపాలన గురించి వాస్తవాలు వెల్లడించిన కంతేరుకు చెందిన దళిత మహిళపై దాడి హేయమైన చర్య అని అన్నారు. వెంకాయమ్మకు అండగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసి ఆమెపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ఇంకా పూర్తికాని మండల కమిటీలను పూర్తి చేయాలన్నారు. ఈ నెల 19న ఫిరంగిపురం, 20న మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో, 22న నియోజకవర్గ స్థాయిలో తాడికొండ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద బాదుడే బాదుడే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం బీసీ కమిటీలను నియమించాలని సూచించారు. కార్యక్రమంలో కంచర్ల శివరామయ్య, గుంటుపల్లి మథుసూదనరావు, కొత్తపల్లి కోటేశ్వరరావు, పాములపాటి శివన్నారాయణ, సురేంద్ర, వెంకటసుబ్బారావు, ప్రసన్నకుమార్‌, రమేష్‌, నరసింహారావు, నాగమల్లేశ్వరరావు. నియోజక వర్గ పరిధిలోని మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-19T05:13:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising