ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు కన్నీరు రాష్ట్రానికి అరిష్టం

ABN, First Publish Date - 2022-01-13T06:25:37+05:30

అన్నం పెట్టే రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టమని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ అన్నారు.

బ్రాహ్మణకోడూరు వద్ద ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మేల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతులకు మద్ధతుగా ధూళిపాళ్ల రాస్తారోకో

పొన్నూరుటౌన్‌, జనవరి 12 :  అన్నం పెట్టే రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టమని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ అన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు వద్ద జీబీసీ రోడ్డు పై బుధవారం టీడీపీ రాస్తారోకో నిర్వహించింది. రహదారి పై ధాన్యం పోసి తమ నిరసనను రైతులు వ్యక్తం చేశారు. రైతులకు సంఘీభావంగా ధూళిపాళ్ల  రాస్తారోకోలో పాల్గొని తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండు గంటలకు పైగా ప్రధాన రహదారి పై భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పలువురు రైతులు వాహన దారుల వద్దకు వెళ్లి తమ మొర ఆలకించాలని తమ నిరసనకు జరుగుతున్న ఇబ్బందిని మన్నించాలని వాహనదారులను వేడుకున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు లేకుంటే ఎ ఒక్కరూ మన జాలరని తమ మొర ఆలకించాలని వేడుకోగా వాహనదారుల నుంచి రైతులకు మద్దతు లభించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పొన్నూరు, చేబ్రోలు మండలాలకు చెందిన రైతులు రాస్తారోకోలో పాల్గొన్నారు. రాస్తారోకోను ఉద్దేశించి నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు దోపిడీ పాలన సాగుతుందని ఆరోపించారు. రైతు ద్రోహిగా జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించకుండా ఇబ్బంది పెట్టడం వలన రైతుల బహిరంగ మార్కెట్‌లో ధాన్యాన్ని నష్టాలకు తెగనమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మరో వైపు రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేసిన వారి జాబితా బయట పెట్టే దమ్ము పాలకులకు ఉందా అని నిలదీశారు. రైతులు అల్లాడి పోతుంటే రైతుల నిస్సాహయతను ఆసరాగా తీసుకుని వైసీపీ నాయకులు ధాన్యం కొనుగోళ్లను వారి ఆదాయ వనరులుగా మార్చు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రత్తిపాడులో వేలాది ఎకరాలలో మిర్చి పంట దెబ్బతిని రైతులు నష్టపోయారన్నారు. జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలలో మిర్చి పంట నష్టపోతే కనీసం ఆ రైతులను పరామర్శించి ఓపిక కూడా ముఖ్యమంత్రికి లేకపోవడం తమకు ఆవేదన కలిగిస్తుందన్నారు.  పల్నాడులో ఓ వైసీపీ ప్రజాప్రతినిధిని ధాన్యం కొనుగోలపై నిలదీసినందుకు హత్యాయత్నం కేసు పెట్టి జైలుపాలు చేసిన ఘనత వైపీపీ ప్రభుత్వానిది, పాలకులదేనని ధ్వజమెత్తారు.  ఆరుగాలం శ్రమించి పంటలను పండించిన రైతులను ఆదుకునే వరకు ఉద్యమిస్తానని నరేంద్రకుమార్‌ స్పష్టం చేశారు. అనంతరం చేబ్రోలు సీఐ సుబ్బారావు, పొన్నూరు రూరల్‌ ఎస్‌ఐ భాగ్యరాజు నరేంద్రకుమార్‌తో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింపజేశారు. రెండు గంటలకు పైగా జీబీసీ రోడ్డు పై రైతుల ధర్నా జరగటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పొన్నూరు, చేబ్రోలు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. 


Updated Date - 2022-01-13T06:25:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising