వైసీపీ తాడికొండ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా సురేష్
ABN, First Publish Date - 2022-12-16T00:59:28+05:30
వైసీపీ తాడికొండ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా కత్తెర సురేష్ కుమార్‌ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
తాడికొండ, డిసెంబర్ 15: వైసీపీ తాడికొండ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా కత్తెర సురేష్ కుమార్‌ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ నుంచి గురువారం ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. గతంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను అదనపు సమన్వయకర్తగా ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఆయనను పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల నియమించారు. ఇప్పుడు డొక్కా స్థానంలో కత్తెరను నియమించారు.
Updated Date - 2022-12-16T00:59:31+05:30 IST