ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలను మారిస్తే ఇబ్బందే

ABN, First Publish Date - 2022-07-08T04:46:50+05:30

విలీనం పేరుతో పాఠశాలలను మారిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడతారు.. అలా మార్చొద్దు.. ఎక్కడి పాఠశాలలను అక్కడే ఉంచాలంటూ గురువారం కూడా పలు ప్రాంతాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు.

వేల్పూరులో పాఠశాలను మార్చ వద్దంటూ ధర్నా చేస్తున్న విద్యార్థులు, తెలుగుదేశం పార్టీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విలీనంపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆగ్రహం 

అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో ఆందోళనలు

అచ్చంపేట, క్రోసూరు, జూలై 7: విలీనం పేరుతో పాఠశాలలను మారిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడతారు.. అలా మార్చొద్దు.. ఎక్కడి పాఠశాలలను అక్కడే ఉంచాలంటూ గురువారం కూడా పలు ప్రాంతాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు. అచ్చంపేట మండలం వేల్పూరు, చింతపల్లి గ్రామాల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులను మరో పాఠశాలకు మార్చొద్దని వేల్పూరు బస్టాండ్‌ వద్ద  విద్యార్థులు ధర్నా చేశారు. విద్యార్థులకు టీడీపీ నాయకులు  మద్దతు పలికారు. పాఠశాలను మారిస్తే పిల్లలకు దూరమవుతుందని, విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అందువల్ల పాఠశాలను యఽథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు నల్లపాటి చందు, పొన్నెకంటి రవి చంద్రశేఖర్‌, పొన్నెకంటి శ్రీనివాసరావు, ఎన్‌ వెంకటరావు, జువ్వా శంకర్‌, పొన్నెకంటి గోవిందరావు, ఆమంచి రవి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలను మార్చవద్దంటూ చింతపల్లి పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్‌ఈవో వేల్పుల రాజశేఖర్‌కు  వినతిపత్రం అందజేశారు.  

అనంతవరంలో రాస్తారోకో 

క్రోసూరు మండలం అనంతవరం బీసీ ప్రాథమిక పాఠశాలను కిలో మీటరు దూరంలో ఉన్న యూపీ స్కూల్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ గురువారం విద్యార్థుల సహా తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. పిడుగురాళ్ల, క్రోసూరు ప్రధాన రహదారిలో రోడ్డుపై బైఠాయించి రాకపోకలు స్తంభింప చేశారు. అనంతవరంలోని బీసీ ప్రాథమిక పాఠశాలను దశాబ్దాల క్రితం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నామని, ఇప్పుడు ఆ పాఠశాలను విలీనం చేయడమంటే విద్యార్థులకు అన్యాయం చేసినట్లేనని తల్లిదండ్రులు అన్నారు. క్రోసూరు - పిడుగురాళ్ల రహదారిలో ప్రతి రోజు వందలాది టన్నుల ఇసుక లోడులతో లారీలు తిరుగుతుంటాయని, ప్రతి క్షణం ఈ రహదారి ప్రమాదకరంగా ఉంటుందన్నారు. ఈ మర్గాంలో 3, 4, 5 తరగతుల పిల్లలు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుందని వాపోయారు. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడానికే ప్రభుత్వం విలీన ప్రక్రియను ప్రారంభించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పాఠశాల విలీనాన్ని ఉప సంహరించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.   

Updated Date - 2022-07-08T04:46:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising