ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్‌జిల్లాల టెన్నిస్‌ లీగ్‌ పోటీలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-06-26T05:49:39+05:30

క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి అన్నారు.

శాప్‌ టెన్నీస్‌ లీగ్‌ పోటీలను ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(క్రీడలు), జూన్‌25: క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి అన్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్ధానిక బీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న శాప్‌ టెన్నిస్‌లీగ్‌, ఇంటర్‌ డిస్ట్రిక్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన క్రీడాకారులకు వచ్చే ఏడాది నుంచి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. క్రీడల నిర్వహణకు బీఆర్‌ స్టేడియం ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ కన్వీనర్‌ దుర్గాప్రసాదు మాట్లాడుతూ రాష్ట్రంలో 29 క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, శాప్‌ ఆధ్వర్యంలో నగరంలో టెన్నిస్‌ టోర్నమెంట్‌ నిర్వహించండం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో స్టెప్‌ సీఈవో పి.వెంకటనారాయణ, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి వెంకటేశ్వరరావు, గుంటూరు తూర్పు తహసీల్దారు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T05:49:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising