ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రి వేళ ఆకతాయిల ఆగడాలు

ABN, First Publish Date - 2022-06-30T05:10:33+05:30

శ్రీనివాసరావుతోటలో రాత్రి పూట కొంతమంది ఆకతాయిలు పార్కు చుట్టుపక్కల ప్రదేశాల్లో తిరుగుతున్నారని స్థానిక మహిళలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

శ్రీనివాసరావుతోటలో మహిళలను సమస్యలు అడిగి తెలుసుకుంటున్న జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీకి శ్రీనివాసరావుతోట మహిళల ఫిర్యాదు

గుంటూరు, జూన్‌ 29: శ్రీనివాసరావుతోటలో రాత్రి పూట కొంతమంది ఆకతాయిలు పార్కు చుట్టుపక్కల ప్రదేశాల్లో తిరుగుతున్నారని స్థానిక మహిళలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బుధవారం ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌  చుట్టుగుంట, కేవీపీకాలనీ, శ్రీనివాసరావుతోట తదతర ప్రాంతాల్లో పర్యటించారు. శ్రీనివాసరావుతోటలోని అచ్చయ్యడాబా సెంటరులో ఉన్న వాటర్‌ ట్యాంకు వద్ద పార్కు ప్రదేశంలో ఆయన అధికారులతో కలిసి పర్యటించి స్థానిక మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెయిన్‌రోడ్డులో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. శ్రీనివాసరావుతోట ప్రాంతంలో రాత్రి వేళ గస్తీని పటిష్టం చేయాలని మున్సిపల్‌ అధికారులతో మాట్లాడి వీధి దీపాలు ఏర్పాటు చేయించాలని నగరంపాలెం సీఐ హైమారావును ఆదేశించారు. ఎస్పీ వెంట వెస్టు ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు, నగరంపాలెం సీఐ హైమారావు, సీసీఎస్‌ సీఐ బాలసుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ రవితేజ, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-30T05:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising