ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్తెనపల్లిలో... స్థానిక నినాదం

ABN, First Publish Date - 2022-12-07T00:55:57+05:30

సత్తెనపల్లి నియోజకవ ర్గ టీడీపీ వర్గపోరు స్థానిక నినాదం చుట్టూ తిరుగుతుంది. నియో జకవర్గ పార్టీ ఇనచార్జి పదవి కోసం పోటీ పడుతున్న నేతల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమావేశంలోపాల్గొన్న జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నాగోతు శౌరయ్య

నరసరావుపేట, సత్తెనపల్లి, డిసెంబరు 6: సత్తెనపల్లి నియోజకవ ర్గ టీడీపీ వర్గపోరు స్థానిక నినాదం చుట్టూ తిరుగుతుంది. నియో జకవర్గ పార్టీ ఇనచార్జి పదవి కోసం పోటీ పడుతున్న నేతల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. వివాదాలను పరిష్కరించడంలో అధి ష్ఠానం మౌనం వీడడంలేదు. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులును ఇనచార్జిగా నియమిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇందుకు ఇటీవల ప్రకటించిన పార్టీ పదవుల్లో ఆయన వర్గీయులకే ప్రాధాన్యం ఉండటమే ఉదాహరణగా కారణమని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విభేదాలను పక్కన పెట్టి వైవీ వ్యతిరేక వర్గం ఒక తాటిపైకి వచ్చింది. అధిష్ఠానంతో తేల్చుకునేందుకు వైవీ వ్యతిరేక వ ర్గం సిద్ధమైంది. ఇనచార్జి పదవి విషయంలో స్థానిక గళాన్ని వినిపి స్తున్నది. ఈ నేపఽథ్యంలోనే మంగళవారం సత్తెనపల్లి పార్టీ కార్యాల యంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు నాగోతు శౌరయ్య నేతృత్వం లో డాక్టర్‌ కోడెల శివరాం వర్గం, నాగోతు శౌరయ్యవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. సత్తెనపల్లి పార్టీ టిక్కెట్‌ను గతంలో కూడా స్థానికేతరులకు ఇచ్చారని ఈ విధా నానికి స్వస్థి పలకాలని నేతలు తేల్చి చెబుతున్నారు. స్థానికులకే ఇనచార్జి పదవి ఇవ్వాలని నారా చంద్రబాబు, నారా లోకేశ అచ్చెన్నా యుడులను కలిసి తమ వాణి వినిపించాలని సమావేశంలో నాయ కులు తీర్మానించారు. స్థానికులకు ఇనచార్జి పదవి ఇవ్వకుంటే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందనివారు అభిప్రాయ వ్యక్తం చేశారు. స్థానికుడినైన తాను ఇనచార్జి పదవి ఆశిస్తున్నట్లు నాగోతు శౌరయ్య సమావేశంలో ప్రకటించారు. ఇనచార్జి పదవి, తదుపరి పార్టీ టిక్కెట్‌ను కూడా స్థానికులకే ఇవ్వాలన్న వాదన ఆయన వినిపిం చారు. ఇతర నేతలు కూడా స్థానికులకే పదవి ఇవ్వాలన్న వాదనను సమర్ధించారని ఆయన చెప్పారు. స్థానికులకే పదవి అని సమావేశం లో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీ మొదటి నుంచి స్థానికే తరులకు, సీపీఎం అభ్యర్థులకు టిక్కెటు ్లకేటాయిస్తూ వచ్చిందని శౌరయ్య తెలిపారు. 2009లో స్థానికులకే టిక్కెట్‌ ఇస్తే టీడీపీ విజ యం సాధించేదన్నారు. 2009 నుంచి తాను టిక్కెట్‌ కోసం ప్రయత్ని స్తున్నానట్లు తెలిపారు. సత్తెనపల్లిలో టీడీపీకి బలమైన కేడర్‌ ఉంద న్నారు. సత్తెనపల్లిలో టీడీపీ విజయం సాధిస్తే రాష్ట్రంలో కూడా టీడీ పీ విజయం సాధిస్తుందన్నారు. స్థానికులు కానివారికి టిక్కెట్‌ ఇస్తే వారు ఓడిపోతే నియోజకవర్గాన్ని పట్టించుకోరన్నారు. సమావేశంలో నాయకులు సయ్యద్‌ పెదకరిముల్లా, ఆతుకూరి నాగేశ్వరరావు, కొం డ్రగుంట రంగారావు, కోమటినేని శ్రీనివాసరావు, అంచుల నరసింహ రావు, నలబోతుపాపారావు, అహమ్మద్‌బుడే, నకరికల్లు మండల టీడీపీ అధ్యక్షుడు సత్యనారాయణ, మస్తానవలి, వైవీ వెంకటేశ్వరరా వు, కంభంపాటి అబ్రహాం, బండారు నాగరాజు, కోయ లక్ష్మయ్య, పుట్ట చలమయ్య, ఈదర రామారావు, తోట వెంకటేష్‌, గుర్రం వెంక టేశ్వరరావు, కోట జోసఫ్‌, రాంబోబుడే, చినఅబ్దుల్లా పాల్గొన్నారు.

నేను లోకల్‌.. వైవీ

వైవీ ఆంజనేయులు స్థానికుడు కాదని ఆయన వ్యతిరేక వర్గం చే స్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. తాను సత్తెన పల్లి ఎమ్మెల్యేగా పని చేశానని, తనకు సొంత ఇల్లు సత్తెనపల్లి పట్టణంలో ఉందని, తనకు ఓటు కూడా నియోజకవర్గంలో ఉందని ఆయన చెబుతున్నారు. పార్టీ ఇనచార్జి పదవిని తాను ఆశిస్తున్నాన ని, ఈ పరిస్థితుల్లో ఎవరికి ఆ బాధ్యత ఇచ్చినా పార్టీ అభివృద్ధికి కట్టుపడి ఉంటానంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో వర్గపోరు ముదిరి పాకాన పడినా, అధిష్ఠానం మాత్రం వేచి చూసే ధోరణి ప్ర దర్శిస్తుండటాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. అధి ష్ఠానం మాటకు కట్టుబడి ఉండే నేతకే సత్తెనపల్లి పగ్గాలు ఇవ్వాలని పార్టీ భావిస్తోందని సమాచారం. భవిష్యతలో పొత్తుల విషయం, ఎవరైనా ఇతర పార్టీల ముఖ్య నేతలు టీడీపీలోకి వచ్చే విషయం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని, సత్తెనపల్లి ఇనచార్జ్‌ నియా మకంలో అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ఇప్పు డు ఇనచార్జి ఇచ్చిన నేత టిక్కెట్‌ కోసం పట్టుబడితే ఇబ్బందులు వస్తాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇనచార్జిని నియమించడంలో జాప్యం జరుగుతున్నట్లు నేతలు చెబుతున్నారు.

Updated Date - 2022-12-07T00:56:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising