ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడి పరిశ్రమ రంగంలో పెనుమార్పులు

ABN, First Publish Date - 2022-09-13T05:39:51+05:30

అంతర్జాతీయంగా పాడి పరిశ్రమ రంగంలో వస్తున్న మార్పులు అధ్యయనం చేయడానికి వరల్డ్‌ డెయిరీ సమ్మిట్‌ ఉపకరిస్తుందని సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ అన్నారు.

వరల్డ్‌ డెయిరీ సమ్మిట్‌లో పాల్గొన్న సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర

వరల్డ్‌ డెయిరీ సమ్మిట్‌లో పాల్గొన్న డెయిరీ ప్రతినిధులు


 చేబ్రోలు, సెప్టెంబర్‌ 12: అంతర్జాతీయంగా పాడి పరిశ్రమ రంగంలో వస్తున్న మార్పులు అధ్యయనం చేయడానికి వరల్డ్‌ డెయిరీ సమ్మిట్‌ ఉపకరిస్తుందని సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఐడీఎఫ్‌ వరల్డ్‌ డెయిరీ సమ్మిట్‌-2022కు సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌, ప్రతినిధులు సోమవారం హాజరయ్యారు. 48 ఏళ్ల తర్వాత దేశంలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమ్మిట్‌ను సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోయిడాలో ప్రారంభించినట్లు నరేంద్రకుమార్‌ వెల్లడించారు. ఈ సమ్మిట్‌ ద్వారా పాడి పరిశ్రమ రంగ అభివృద్ధి, సాంకేతికంగా వస్తున్న మార్పులు, ఎదురయ్యే సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ సమ్మిట్‌లో పాల్గొని డెయిరీ రంగ భవిష్యత్‌, అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. సమ్మిట్‌లో డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.గోపాలకృష్ణన్‌, పాలకవర్గ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-13T05:39:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising