ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగం డెయిరీ రైతుల ఆస్తి.. అంగుళం కూడా కదల్చలేరు

ABN, First Publish Date - 2022-12-15T01:03:01+05:30

సంగం డెయిరీ రైతుల ఆస్తి అని.. దానిని ఒక్క అంగుళం కూడా కదల్చలేరని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరి చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సంగం డెయిరీ చైర్మన్‌ నరేంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంఘం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌

పొన్నూరుటౌన్‌, డిసెంబరు 14: సంగం డెయిరీ రైతుల ఆస్తి అని.. దానిని ఒక్క అంగుళం కూడా కదల్చలేరని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరి చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ అన్నారు. బుధవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమవేశంలో నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్‌ తీసుకువచ్చిన మ్యాక్స్‌ చట్టం గురించి క్షీర విప్లవసారధి కురియన్‌ స్వయంగా ఎన్టీఆర్‌ను ప్రశంసిస్తూ లేఖ రాశారన్నారు. ఆ చట్టానికి వైఎస్సార్‌ సవరణలు చేపడితే ఆయన చర్యలను ఖండిస్తూ కురియన్‌ అప్పటి యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అభ్యంతరాలు తెలియజేసిన విషయాన్ని గుర్తుచేశారు. మంత్రి అప్పలరాజుకు దమ్ము, ధైర్యం ఉంటే చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి సొంత డెయిరీ చేస్తున్న అక్రమాలను నిలదీసి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. యడ్లపాటి వెంకట్రావు తరువాత చైర్మన్‌ అయిన తన తండ్రి ధూళిపాళ్ళ వీరయ్యచౌదరి జిల్లావ్యాప్తంగా పర్యటించి రైతులతో మమేకమై రైతు సంఘాలను ఏర్పాటుచేసి సంగం డెయిరీ పురోగతిలో భాగస్వాములైన విషయాన్ని గుర్తించాలన్నారు. కచ్చితంగా తమ తండ్రి శ్రమతో సంగం డెయిరీ పునాదులున్నాయని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏసీబీతో నెల రోజులకు పైగా సోదాలు నిర్వహించి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే లక్షలు ఖర్చు చేసి హ్యాకర్లను నియమించి సంగం సర్వర్లను హ్యాక్‌ చేయాలని చూసిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పాలకవర్గ సభ్యులను, అధికారులను ప్రభుత్వం ప్రలోభ పెట్టి తమవైపు తిప్పుకోవాలని చూసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రైవేటు సంస్థ అయిన అమూల్‌కు వేల కోట్ల ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. మూడున్నరేళ్ల కాలంగా రాష్ట్రంలో లక్ష పశువులు మృతి చెందాయని, పొన్నూరు నియోజకవర్గంలో 140 పశువులు మృతి చెందాయన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో కేవలం పది పశువులకు మాతమ్రే బీమా చెల్లించారని స్పష్టం చేశారు. ఎంత మంది పశు వైద్యులను నియమించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎందరి రైతులకు పశు బీమా చెల్లించారో మంత్రి సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. మంత్రి అప్పలరాజు సొంత నియోజకవర్గంలో కనిపించిన కొండను, భూములను, మైన్స్‌ను మింగుతున్న అనకొండ అని తీవ్ర ఆరోపణలు చేశారు. సొంత శాఖలో చేసిందేమి లేకపోగా ఉత్తరకుమార ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదమన్నారు. సొంత చెల్లెలిని తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేస్తే పరామర్శించలేని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని మహిళలకు ఏం మేలు చేస్తాడని నిలదీశారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising