ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Employees: దేవుడా.. ఈ సారైనా జీతాలు త్వరగా వచ్చేలా చూడు..

ABN, First Publish Date - 2022-10-04T00:07:44+05:30

Amaravathi: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. పింఛన్‌దారులకు పింఛనూ చెల్లించలేదు. ప్రభుత్వం దగ్గర జీతాలకు సరిపడా నిధులు లేకపోవడంతో ప్రతి నెల జీతాల చెల్లింపు ఆలస్యమవుతోంది. దీంతో విడతల వారీగా జీతాల చెల్లింపు జరుగుతోంది. ఇటు జీతం అకౌంట్లలో జమకాకపోవడంతో ఉ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. పింఛన్‌దారులకు పింఛనూ చెల్లించలేదు. ప్రభుత్వం దగ్గర జీతాలకు సరిపడా నిధులు లేకపోవడంతో ప్రతి నెల జీతాల చెల్లింపు ఆలస్యమవుతోంది. దీంతో విడతల వారీగా జీతాల చెల్లింపు జరుగుతోంది. ఇటు జీతం అకౌంట్లలో జమకాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి ఉద్యోగులైతే జీతం సమయానికి అందుతుందో లేదోనని చేతిబదులు తీసుకుంటున్నారు. పండుగ రోజు కూడా పస్తులేనా? అంటూ కొందరు ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. సోమవారానికి కేవలం 30 నుంచి 40 శాతం మందికి మాత్రమే వేతనాలు, పెన్షన్లు అందాయి. 50 నుంచి 60 శాతం మందికి ఇంకా అందాల్సి ఉంది. సెక్యూరిటీ బాండ్ల వేలంతో ఏపీ సర్కార్‌ రూ.2 వేల కోట్ల రుణం తీసుకుంది. ఈ డబ్బుతో ఉద్యోగులందరికి జీతాలు చెల్లించే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి వేతనాలు పడతాయనే ఆశతో ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌లకు ప్రతి నెల రూ.5,500 కోట్లు అవసరమవుతోంది. ప్రభుత్వం దగ్గర జీతాలకు సరిపడా నిధులు లేకపోవడంతో వేతనాల చెల్లింపు ప్రతినెలా ఆలస్యమవుతోంది. 

Updated Date - 2022-10-04T00:07:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising