ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు.. జాగు

ABN, First Publish Date - 2022-07-03T04:48:54+05:30

సాగుకు ప్రకృతి సహకరించడంలేదు.. వానలు కురవడంలేదు. జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొంది. సాగు ఆలస్యమవుతోంది. పంటల సాగుకు పొలాలు దున్నిన రైతులు విత్తనం విత్తేందుకు వర్షాల కోసం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు.

దుక్కి దున్నిన పొలం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో తీవ్ర వర్షాభావం 

46 శాతం లోటు వర్షపాతం

నైరుతి వచ్చి నెల గడిచినా కురవని వర్షాలు

ఆందోళనలో అన్నదాతలు

ఇప్పటికి 2 శాతమే పంటల సాగు

22 మండలాల్లో చినుకే లేదు..


నరసరావుపేట, జూలై 2: సాగుకు ప్రకృతి సహకరించడంలేదు.. వానలు కురవడంలేదు. జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొంది. సాగు ఆలస్యమవుతోంది. పంటల సాగుకు పొలాలు దున్నిన రైతులు విత్తనం విత్తేందుకు వర్షాల కోసం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. వరుణుడు కరుణించక పోతుండటంతో సాగు సందిగ్ధంలో పడుతోంది. సాగుకు అన్ని విధాల సమాయత్తమైన రైతులను నైరుతి నిరాశపరుస్తోంది. ఇప్పటికి కేవలం 2 శాతమే పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. గత ఏడాది ఈ సమయానికి 30 శాతం వరకు పంటలు సాగు చేశారు. జిల్లాలో పంటల సాగుకు గడ్డుకాలం నెలకొనడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

 జూన్‌ మొదటివారంలో కురవాల్సిన వానలు జూలై మొదటివారం వచ్చినా వాటి జాడ కనిపించడంలేదు. నైరుతిలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వ్యవసాయ శాఖ ప్రకటించినా చినుకు రాలడంలేదు. ఇప్పటికి సాధారణ వర్షపాతం 89.10 మి.మి. నమోదు కావాలి. 48.10 మి.మి వర్షపాతం నమోదైంది. 46 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. జిల్లాలోని 28 మండలాల్లో 22 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. రెండు మండలాల్లో అధిక, నాలుగు మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి.  

 పత్తి విత్తనం రైతులు విత్తేందుకు పొలాలను సిద్ధం చేశారు. విత్తనాలు కొనుగోలు చేశారు. వర్షం కురవకపోతుండటంతో విత్తనం నాటే పరిస్థితి లేదు. జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణమే అధికం. మిరప, వరి విస్తృతంగా సాగు అవుతాయి. పత్తి సాధారణ విస్తీర్ణం 3,42,568 హెక్టార్లు. ఇప్పటికి 12,990 హెక్టార్లలో మాత్రమే సాగైంది. 2 శాతం మాత్రమే పత్తి సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. గత ఏడాది ఈ సమయానికే 30 శాతం అంటే 97,520 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. మిరప సాధారణ విస్తీర్ణం 1,44,655 ఎకరాలు కాగా ఒక్క ఎకరంలో కూడా మిరప సాగు కాలేదు. గత ఏడాది ఈ సమయానికి 4,339 ఎకరాల్లో మిరప సాగు చేశారు. అపరాల సాగు ఇలానే ఉంది. అపరాల సాధారణ విస్తీర్ణం 61,290 ఎకరాలు కాగా 9,498 ఎకరాల్లో సాగు చేశారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు జరగాల్సిన తరుణంలో వ్యవసాయ కార్మికులకు పనులు లభించడం లేదు. వర్షాల కోసం రైతులు వరుణుడిని ప్రార్థిస్తున్నారు.  


Updated Date - 2022-07-03T04:48:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising