ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ నీటి సమాచారం

ABN, First Publish Date - 2022-08-07T05:16:52+05:30

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం శనివారం నాటికి 569.90 అడుగులు ఉంది. ఇది 256.32 టీఎంసీలకు సమానం.

ప్రకాశం బ్యారేజి దిగువకు విడుదల అవుతున్న వరదనీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయపురిసౌత్‌, ఆగస్టు 6: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం శనివారం నాటికి 569.90 అడుగులు ఉంది. ఇది 256.32 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 2,712 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 2,053, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 6,565 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 76,515 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.70 అడుగులుంది. ఇది 213.88 టీఎంసీలకు సమానం. జూరాల నుంచి శ్రీశైలానికి 74,515 క్యూసెక్కులు, రోజా నుంచి 62,040 క్యూసెక్కులు, మొత్తంగా శ్రీశైలం జలాశయానికి 1,35,555 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 


 బ్యారేజి దిగువకు 37,100 క్యూసెక్కులు 

 తాడేపల్లి టౌన్‌: కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎగువన ఉన్న వాగుల నుంచి ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌కు వరదనీటి ఉధృతి క్రమేపీ పెరిగింది. కీసర, మునేరు, పాలేరు, మధిర, ముజినేపల్లి తదితర వాగుల నుంచి శనివారం సాయంత్రానికి 46,600 క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 9,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అలాగే బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ, 50 గేట్లను ఒకఅడుగు మేర ఎత్తి 37,100 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నట్టు తెలిపారు. 


Updated Date - 2022-08-07T05:16:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising