ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో 117తో టీచర్‌ పోస్టుల కుదింపు

ABN, First Publish Date - 2022-07-07T05:29:23+05:30

నూతన విద్యావిధానం పేరుతో రాష్ట్రప్రభుత్వం జీవో 117ను విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులను కుదిస్తున్నారని సంఘాల నేతలు ఆరోపించారు.

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న యుటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌్‌, ఇతర సంఘాల నాయకలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో యుటీఎఫ్‌ నాయకలు

నరసరావుపేట టౌన్‌, జూలై 6: నూతన విద్యావిధానం పేరుతో రాష్ట్రప్రభుత్వం జీవో 117ను విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులను కుదిస్తున్నారని సంఘాల నేతలు ఆరోపించారు. బుధవారం యూటీఎఫ్‌ కార్యాలయంలో ప్రస్తుత విద్యా సంక్షోభానికి పరిష్కారం అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ రహస్య అజెండాతో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం ప్రవేశపెట్టిందన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకోవాలని,  విలీనం చేసి పాఠశాల విద్యను పిల్లలను దూరం చేసే ప్రయత్నాలను ప్రారంభించిందన్నారు. ప్రజలను చైతన్యం చేసి, ప్రజా సంఘాలు ఉద్యమం చేయాలని సదస్సు తీర్మానం చేసింది. కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు జి.రవిబాబు అధ్యక్షత వహించిన  ఈ కార్యక్రమంలో యుటీఎప్‌ జిల్లా అధ్యక్షుడు పి.ప్రేమ్‌కుమార్‌, ప్రధానకార్యదర్శి విజయసారధి,  ఎస్‌కే కరిముల్లా,  సుభాష్‌ చంద్రబోస్‌,  కరిముల్లా,  జాన్‌సైదా తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-07T05:29:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising