ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిని అభివృద్ధి చేయాలి

ABN, First Publish Date - 2022-03-05T05:34:45+05:30

‘హైకోర్టు తీర్పు ప్ర కారం రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి ని అభివృద్ధి చేయాల్సిందే. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతుల ప్లాట్లను మూడు నెలల్లో అభివృద్ధి చేసి, ఆరు నెలల్లో మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం పనులు పూర్తి చేయాలి.

సభలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టు తీర్పు అమలు చేయకుంటే జైలుకే 

తేల్చిచెప్పిన టీడీపీ, బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్‌ నేతలు

808వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు 

సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ - బిల్డ్‌ అమరావతి నినాదంతో ఉద్యమంలోకి

మందడంలో విజయోత్సవాలు.. నెక్కల్లు, రాయపూడిల్లో రైతుల ప్రార్థనలు



తుళ్లూరు, మార్చి 4: ‘హైకోర్టు తీర్పు ప్ర కారం రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి ని అభివృద్ధి చేయాల్సిందే. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతుల ప్లాట్లను మూడు నెలల్లో అభివృద్ధి చేసి, ఆరు నెలల్లో మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం పనులు పూర్తి చేయాలి. కాదు కూడదు.. లేదంటే అధికారులు జైళ్లకు వెళతారు..’ అని టీడీపీ, బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు తేల్చి చెప్పారు. ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అనే నినాదంతో అమరావతి రైతులు చేస్తోన్న ఆందోళనలు శుక్రవారంతో 808 రోజుకు చేరాయి. హై కోర్టు తీర్పు నేపథ్యంలో నెక్కల్లు  రైతులు,  మహిళలు కొవ్వొత్తులు వెలిగించి చర్చిల్లో ప్రార్థనలు చేశారు. రాయపూడిలో ముస్లిం మైనార్టీ జేఏసీ సభ్యులు, మహిళలు జెండా చెట్టువద్ద అల్లాకు ప్రార్థనలు చేశారు. రాజధాని 29 గ్రామాలలో అమరావతి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇప్పటివ రకు సేవ్‌ అమరావతి దిశగా సాగిన ఉద్య మం ఇకపై ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ - బిల్డ్‌ అమ రావతి’ అనే నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు రైతులు, మహిళలు ప్రక టించారు. సీఎం జగన్‌ నోటి నుంచి అమ రావతే ఏకైక రాజధాని అని స్పష్టమైన ప్రక టన వచ్చే వరకు తమ పోరు ఆగదని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం మందడం శిబిరంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమాల్లో వివిధ పక్షాల నేతలు పాల్గొని అమరావతి రైతులకు సం ఘీభావం ప్రకటించారు. ఇకపై కూడా అమరావతి ఉద్యమానికి అండగా ఉంటా మని హామీ ఇచ్చారు.

 ఎమ్మెల్సీ యలమంచలి అశోక్‌బాబు మాట్లాడుతూ సీఎం జగన్‌రెడ్డి తీరుతో హైకోర్టు తీర్పు తర్వాత కూడా అమరావతి అభివృద్ధి కోసం పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడుతుందా.. సుప్రీంకోర్టుకు వెళుతుందా.. తెలిస్తే దానిని బట్టి పోరాటం తీ రు మారుతుందన్నారు. ఉద్యమానికి ఉన్న త న్యాయస్థానం తీర్పు ఒక ఆయుధమైందన్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు  అప్రమత్తంగా ఉండాలన్నారు. 

- మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ నేలపాడులో ఉన్న న్యాయస్థానం రైతులను కాపాడిందన్నారు. 151 సీట్లు ఇచ్చారనే అహంకారంతో జగన్‌రెడ్డి ఉన్నారన్నారు. రాజధానికి భూములిచ్చి 189 మంది అమరులయ్యారని, ఆ కుటుంబాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. 

- మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ 808 రోజుల తరువాత రాజధాని రైతులు, ప్రజలు హైకోర్టు తీర్పుతో గురువారం తీపి కబురు విన్నారన్నారు. సీఎంతో పాటు, వైసీపీ మంత్రులకు చట్టా లు అంటే గౌరవం లేదని ఆరోపించారు.

- సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు మీద కోపం ఉంటే వ్యక్తిగతంగా సీఎం జగన్‌రెడ్డి చూసుకోవాలని, కాని అమరావతి జోలికి వచ్చి పెద్ద తప్పు చేశారన్నారు. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం కోర్టు తీర్పు ద్వారా వచ్చిందన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమరావతి రైతులు తగ్గకుండా ఉద్యమాన్ని నడిపారని, అందులో కీలకపాత్ర మహిళలదని ప్రశంసించారు.  

- బీజేపీ రాష్ట్ర నాయకుడు లంకా దినకర్‌ మాట్లాడుతూ బీజేపీ  అమరావతి రా జధానికి కట్టుబడి ఉందని కేంద్ర నిధులు కూడా కేటాయించిందన్నారు. రాజధానిలో  కేంద్ర సంస్థల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. అయినా ఆగవన్నారు.  

- కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ బుద్ధి తెచ్చుకుని అమరావతి అభివృద్ధిని కొనసాగించాలన్నారు.

- సినీ హీరో శివాజీ మాట్లాడుతూ ప్రాం తాల మధ్య విద్వేషాల కోసం మూడు రాజ ధానులు పెట్టాలనుకోవడం అవివేకమన్నా రు. విజన్‌ ఉన్న నాయకులను ఎన్నుకుంటే మనకు ఈ ఖర్మ పట్టేది కాదన్నారు. 

- అమరావతి పరిరక్షణ సమితి అధ్య క్షుడు కొలకపూడి శ్రీనివాసరావు మాట్లాడు తూ  సీఎం జగన్‌రెడ్డి నియంత పోకడ లు ఆపేసి హైకోర్టు తీర్పును అమలు చేయా లన్నారు.  

- టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ అనేక రకాలుగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా మహిళా శక్తి తలవంచకుండా ఉద్యమం ఉధృతం చేసిందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం, మహిళా నేతలు అన్నబత్తుని విజయలక్ష్మి, కంభపాటి శిరీష, పులి సువార్త తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T05:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising