ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-10-07T05:51:09+05:30

పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని పిన్నెల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాచవరం, అక్టోబరు6: పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని పిన్నెల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ కోటయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మహంకాళి చంద్రశేఖర్‌ (42) భార్య శివపార్వతి, మరికొంతమంది కూలీలతో కలసి మిరపమొక్కలు నాటేందుకు పొలం వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావటంతో చెట్టుకిందకు వెళ్లారు. అదే సమయంలో పిడుగుపడి చంద్రశేఖర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మరొక వ్యక్తి స్పృహతప్పి పడిపోవటంతో పిడుగురాళ్ల వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి నలుగురు పిల్లలు ఉన్నారు. 

 పిడుగుపాటుకు పేలిన సెల్‌ఫోన్‌

పిడుగురాళ్ల, అక్టోబరు6: పిడుగుపడి జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ పేలి వ్యక్తి గాయాలపాలైన ఘటన బుధవారం పిడుగురాళ్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన వడ్డెంగుంట సాంబయ్య గేదెలను తోలుకుని పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో పిడుగు  పడింది. దీంతో చొక్కా జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ పేలిపోయింది. సమీప పొలాల్లోని రైతులు సాంబయ్యను పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Updated Date - 2022-10-07T05:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising