ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు గంటలు.. కుండపోత

ABN, First Publish Date - 2022-08-05T04:57:55+05:30

మండలంలోని గొట్టిపాడు - ఉన్నవ మధ్యలో గురువారం భారీ వాన కురిసింది.

జలమయమైన గొట్టిపాడు నుంచి ఉన్నవ వెళ్లే రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్తిపాడు, యడ్లపాడుల్లో దంచికొట్టిన వాన

లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయం

ప్రత్తిపాడు, ఆగస్టు4: మండలంలోని గొట్టిపాడు - ఉన్నవ మధ్యలో గురువారం భారీ వాన కురిసింది. సుమారు రెండు గంటల సేపు కురిసిన వర్షానికి బ్రిడ్జి పై నుంచి నీరు ప్రవహించడంతో పాటు ప్రధాన రహదారి మొత్తం జలమయమైంది. ప్రత్తిపాడు నుంచి బోయపాలెం వెళ్లే రహదారిలో మోకాళ్ల పై వరకు నీరు నిలిచి పోయాయి. దీంతో సుమారు నాలుగు గంటలు వాహన రాకపోకలు పూర్తిగా నిలిచాపోయాయి.


యడ్లపాడులో భారీ వర్షం

యడ్లపాడు: మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నంగంటల వరకు ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 2 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి జల్లులతో మొదలైన వాన దంచికొట్టింది. గంట వ్యవధిలోనే 53 మి.మీల వర్షం కురిసింది. వర్షానికి బోయపాలెం లంబాడికాలనీ, ముస్లిం కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో  నిత్యావసరాలు మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని వారు పిల్లలను తీసుకుని రోడ్లపైకి చేరుకున్నారు.   




Updated Date - 2022-08-05T04:57:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising