ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్‌విహార్‌లో ఘనంగా వేడుకలు

ABN, First Publish Date - 2022-01-27T04:53:18+05:30

స్థానిక నల్లపాడులోని రైల్‌విహార్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

నల్లపాడులోని రైల్‌విహార్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డీఆర్‌ఎం ఆర్‌ మోహన్‌రాజా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జనవరి 26(ఆంధ్రజ్యోతి): స్థానిక నల్లపాడులోని రైల్‌విహార్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆర్‌.మోహన్‌రాజా జాతీయ జెండాని ఎగురవేసి వందనం చేశారు. అనంతరం ఓపెన్‌ టాప్‌ వాహనంలో ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ దళాల పరేడ్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైల్వే అధికారులు, ఉద్యోగులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకొన్నాయి. 

రైల్వే ఉద్యోగార్ధులకు విజ్ఞప్తి

రైల్వేలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు గుంటూరు రైల్వే డివిజనల్‌ అధికారి ఒక విజ్ఞప్తి చేశారు. కొంతమంది అభ్యర్థులు రైల్వేట్రాక్‌లపై రాస్తారోకోలు, రైళ్లను అడ్డుకోవాలని చూడటం, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం వంటి సంఘటనల్లో భాగాస్వామ్యం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై వచ్చిన అభియోగాలను విచారించి తగిన పోలీసు యాక్షన్‌ తీసుకోవడంతో పాటు జీవితకాలం రైల్వే ఉద్యోగం లభించకుండా డీబార్‌ చేయడం జరుగుతుందన్నారు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియని పారదర్శకంగా నిర్వహించేందుకు నిబద్ధతతో పని చేస్తోన్నాయన్నారు.  

Updated Date - 2022-01-27T04:53:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising