వైసీపీ అరాచకాలపై పోరాడాలి
ABN, First Publish Date - 2022-12-16T00:55:49+05:30
అధికారంలో ఉన్న వైసీపీ అరాచ కాలు, అక్రమాలు, అవినీతి, దౌర్జ న్యాలపై పోరాడాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురువారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో జరిగిన 20 నుంచి 38 వార్డుల టీడీపీ శ్రేణుల సమావేశం లో పిలుపునిచ్చారు.
చిలకలూరిపేట, డిసెంబరు 15 : అధికారంలో ఉన్న వైసీపీ అరాచ కాలు, అక్రమాలు, అవినీతి, దౌర్జ న్యాలపై పోరాడాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురువారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో జరిగిన 20 నుంచి 38 వార్డుల టీడీపీ శ్రేణుల సమావేశం లో పిలుపునిచ్చారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అక్రమాలు, అరాచకాలు పెరిగాయని, అక్రమ కేసులతో వేదింపులు జరుగుతున్నాయని, ధరలు విపరీతంగా పెరిగాయని, వీటన్నింటి గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి పార్టీ శ్రేణు లు నియోజకవర్గంలోని ప్రతి గడపతొక్కాలని ఆయన కోరారు. రియల్ టైమ్ స్టేటజీ, సూపర్-30పైన ఐటీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మారెళ్ళ అప్పారావు పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. సమావేశానికి పట్టణ శాఖ పార్టీ కార్యద ర్శి పఠాన్ సమద్ ఖాన్ అధ్యక్షత వహించారు. పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరి సదాశివరావు, కరిముల్లా, ఇనగంటి జగదీష్, జంగా వినాయకరావు, మద్దిబోయిన శివ, అవ్వరు బసవయ్య, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T00:55:51+05:30 IST