ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొట్టి శ్రీరాములు జీవితం.. భావితరాలకు స్ఫూర్తి

ABN, First Publish Date - 2022-12-16T00:44:09+05:30

అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం, ఆయన చేసిన పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తా యని కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి అన్నారు.

పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్యే గిరిధర్‌, కమిషనర్‌ కీర్తి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి

గుంటూరు(తూర్పు), డిసెంబరు 15: అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం, ఆయన చేసిన పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తా యని కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సంద ర్భంగా గురువారం హిందు కళాశాల కూడలిలోని ఆయన విగ్రహానికి పశ్చి మ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌, నగరపాలక సంస్ధ కమిషనర్‌ చేకూరి కీర్తిల తో కలెక్టర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వీసీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జేపీ రాజకుమారి, డీఆర్వో చంద్రశేఖరరావు తదితరులతో కలసి కలెక్టర్‌ పాల్గొన్నారు.

త్యాగానికి ప్రతీక పొట్టి శ్రీరాములు : డేగల

త్యాగానికి ప్రతీక పొట్టి శ్రీరా ములు అని టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌ కొనియాడారు. పార్టీ జిల్లా కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్దంతి నిర్వహించారు. శ్రీరాము లు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో చిట్టాబత్తిన శ్రీనివాసరావు, ఈరంటి వరప్రసాద్‌తదితరులు పాల్గొన్నారు.

హిందూ కళాశాల సెంటర్లో..

గుంటూరు, డిసెంబరు 15: హిందూ కళాశాల సెంటర్‌లోని పొట్టి శ్రీరా ములు విగ్రహానికి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, నగర మేయర్‌ మనోహర్‌నాయుడు, ఎమ్మెల్యే గిరిధర్‌, డిప్యూటీ మేయర్‌ డైమండ్‌ బాబు, పానుగంటి ఛైతన్య, గులాం రసూల్‌ నివాళులర్పించారు.

అవోపా ఆధ్వర్యలో..

అవోపా ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌ అగ్రహారం కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అవోపా అధ్యక్షుడు కేవీ బ్రహ్మం, కార్యదర్శి వెచ్చా రాధాకృష్ణయ్య, మహిళా విభాగం అఽధ్యక్షులు చింతా కల్పన, రంగారత్నశ్రీ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

జనసేన నివాళులు

హిందూ కళాశాల కూడలిలో ఆయన విగ్ర హానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల సురేష్‌, ఆళ్ల హరి పాల్గొన్నారు.

- జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అదనపు ఎస్పీ సుప్రజతో పాటు పలువురు అధికారులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Updated Date - 2022-12-16T00:45:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising