పొట్టి శ్రీరాముల త్యాగం శ్లాఘనీయం
ABN, First Publish Date - 2022-11-02T00:55:15+05:30
ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పొట్టి శ్రీరాముల త్యాగం శ్లాఘనీయమని పలువురు కొనియాడారు.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంలో వక్తలు
నరసరావుపేట, నవంబరు 1: ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పొట్టి శ్రీరాముల త్యాగం శ్లాఘనీయమని పలువురు కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మంగళవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పాలనను ప్రభుత్వం ప్రజల వద్దకు తీసుకువచ్చిందన్నారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన మార్గాలను అన్వేషించాలన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని కొనియాడారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వం పాలనను ప్రజలకు మరింత దగ్గర చేసిందన్నారు. ఏఎస్పీ బిందుమాధవ్, డీఆర్‌వో వినాయకం, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మర్కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తొలుత మెయిన్‌రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఇన్‌చార్జి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
నరసరావుపేట లీగల్: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరయాలు, ఏఎస్పీలు బిందుమాధవ్, రామచంద్రరాజు, ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలుత పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎంపీ, ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆహుతులకు మిఠాయిలు పంచి పెట్టారు.
Updated Date - 2022-11-02T00:55:21+05:30 IST