ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొట్టి శ్రీరాములు త్యాగం అజరామరం

ABN, First Publish Date - 2022-12-16T00:46:43+05:30

ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం అజరామరమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు.

నివాళులర్పిస్తున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, డాక్టర్‌ అరవిందబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ

నరసరావుపేట టౌన్‌, డిసెంబరు 15 : ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం అజరామరమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి డాక్టర్‌ చదలవాడ, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించిన మహాపురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములని అన్నారు. కార్యక్రమంలో గొట్టిపాటి చౌదరిబాబు, గొట్టిపాటి జనార్దన్‌బాబు, ఇమ్మిడిశెట్టి కాశయ్య, షేక్‌ మాబు, యంపరాల ఖాసీమ్‌, సయ్యద్‌ బాషా, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి వనమా శివ, రాష్ట్ర అధికార ప్రతినిధి అత్తులూరి సుబ్బారావు, మాజీ కౌన్సిలర్‌ కొత్తూరి హనుమంతురావు, తాళ్లూరి సత్యనారాయణ, నాగవరపు ప్రసాదు, పల్లపోతు ప్రసాద్‌, రెడ్డి హరనాద్‌బాబు, కాకుమాను శ్రీను, కోడూరి రాము, మీరవలి, కళ్యాణం రాంబాబు, పుచ్చకాయల బసవేశ్వరరావు, ముచ్చు వీరయ్య, గిద్దల వెంకటేశ్వర్లు, బాషా, బత్తుల శంకర్‌, పొత్తూరి శ్రీనివాసరావు, డొక్కు రామకృష్ణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నరసరావుపేట లీగల్‌, డిసెంబరు 15 : ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆజ్యుడు పొట్టి శ్రీరాము లు వర్ధంతిని గురువారం పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రవి శంకర్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో పరిపాలన అదనపు ఎస్పీ జీ బిందు మాధవ్‌, రామచంద్రరాజు, నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కరరావు, ఏఆర్‌ డీఎస్పీ చిన్ని కృష్ణ, సీఐలు, ఆర్‌ఐలు ఎస్‌ఐలు పాల్గొన్నారు.

చిలకలూరిపేట అర్బన్‌, డిసెంబరు 15 : పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం ఆయన చిత్రపటానికి తహసీల్దార్‌ జీ.సుజాత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ రవికుమార్‌, కార్యాలయ సిబ్బంది, వీఆర్‌వోలు పాల్గొన్నారు. కాగా బొప్పూడి గ్రామంలో పూసల సుబ్బయ్య, గుంటు వెంకటప్పయ్య జెడ్పీ హైస్కూల్‌లో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. 2019లో ప్రతిభ అవార్డు పొందిన ఎన్‌.పావనికి ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ బహుకరించారు. కాగా పట్టణంలోని సుగాలీ కాలనీలో గల మునిసిపల్‌ ప్రాథమిక పాఠశాలలో జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో కథల లోకంలో పిల్లలు అనేక కార్యక్రమం జరిగింది. ఇందులో స్థానిక భామా ఫ్యాషన్స్‌ అధినేత కొణిజేటి వెంకట రత్నం సహకారంతో జన విజ్ఞాన ప్రచురించిన 40 రకాల పుస్తకాలను పిల్లలకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షుడు దార్ల బుజ్జిబాబు, పాఠశాల హెచ్‌ఎం అరుణ, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నాదెండ్ల, డిసెంబరు 15 : అమర జీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని గురువారం పలు గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాతులూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ ఐనవోలు రాధాకృష్ణ, సంఘం నేతలు పసుమర్తి శివ నాగేశ్వరరావు, ఎం.నరసింహారావు, జీ.బంగారుబాబు, కే.వెంకట కోటి హనుమంతరావు, టీ నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణపవరంలోని రాజీవ్‌గాంధీ కాలనీలో గల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గురులింగం ఆఽధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఫ యడ్లపాడు, డిసెంబరు 15 : అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని మాజీ ఎండోమెంట్‌ డిప్యూటీ కమిషనర్‌ పోపూరి గంగయ్యచౌదరి అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేసు సురేష్‌, గ్రామస్తులు జి శివరామకృష్ణయ్య, వై సంజీవరావు, కె మంగయ్య, వి నాగేశ్వరరావు, కె అప్పలరాజు, పాఠకులు పాల్గొన్నారు.

వినుకొండ, డిసెంబరు 15 : అమరజీవి పొట్టిశ్రీరాములు, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ వర్థంతి కార్యక్రమాలను స్థానిక వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గంలోని 41 మంది లబ్ధిదారులకు రూ.31.87 లక్షల సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ బత్తుల చిన్నబ్బాయి, నాసరరెడ్డి, పుల్లారెడ్డి, చౌడయ్య, ప్రసాద్‌, ములకా రామతులసిరెడ్డి, పీఎస్‌ ఖాన్‌, రాజా, పెండేల వెంకటపుల్లారావు, బ్రహ్మయ్య, నక్కా నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్థానిక నరసరావుపేట రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు మోటుమర్రి నరసింహారావు, పువ్వాడ కృష్ణ, గట్టుపల్లి శ్రీనివాసరావు, పెనుగొండ శ్రీను, చిలుకూరి కోటేశ్వరరావు, పొత్తూరి రాము, ప్రకాష్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరసరావుపేట రోడ్డులోని శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆడిటర్‌ రాఘవులు, సుధా గణేష్‌బాబు, కోట వెంకటసుధాకర్‌, దేసు వెంకటలక్ష్మీనారాయణ, చిన్ననరసింహారావు, అప్పలరాజా, గర్రె అనిల్‌, యర్రం అనిల్‌, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:46:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising