ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News : చేనేత కళాకారులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా: పవన్

ABN, First Publish Date - 2022-08-07T19:08:16+05:30

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేనేత కళాకారులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో చేనేత కూడా ఒక అహింసాయుత ఆయుధంగా ఉపయోగపడిందని పేర్కొన్నారు. చేనేత కళాకారులను గుర్తు చేసుకుంటూ.. జాతీయ చేనేత దినోత్సవం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేనేత కళాకారులకు జాతీయ చేనేత దినోత్సవ (National Handloom day) శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో చేనేత కూడా ఒక అహింసాయుత ఆయుధంగా ఉపయోగపడిందని పేర్కొన్నారు. చేనేత కళాకారులను గుర్తు చేసుకుంటూ.. జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అయితే చేనేత కళను నమ్ముకున్న వారు ఇంకా అర్ధాకలితోనే జీవనం సాగిస్తుండటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత కళాకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడే వరకు వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ప్రతి కుటుంబం వారంలో ఒకసారైనా చేనేత వస్త్రాలు ధరించాలన్న సంకల్పం గుండెల్లో నిలుపుకోవాలని కోరారు. చేనేత వస్త్రాలు ధరించినప్పుడు కలిగే నిడారంబరత, ప్రశాంతత, లాలిత్యం మనసును హత్తుకుంటుందన్నారు. చేనేతలకు తన జీవితాంతం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని పునరుద్ఘాటించారు. చేనేత కళాకారులు ఆర్థిక పుష్టితో ఆనందకర  జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటున్నానని పవన్ ఆకాంక్షించారు. 

Updated Date - 2022-08-07T19:08:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising