ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యం

ABN, First Publish Date - 2022-12-15T00:43:19+05:30

పట్టణ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింద ని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ తెలిపారు.

అర్బన్‌ పీహెచ్‌సీని ప్రారంభిస్తున్న ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి

మంగళగిరి సిటీ, డిసెంబరు 14: పట్టణ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింద ని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ తెలిపారు. మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి కాలనీలో రూ.కోటి 38 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ అర్బన్‌ పీహెచ్‌సీని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సంద ర్భంగా శ్రీలక్ష్మీ విలేకర్లతో మాట్లాడుతూ అర్బన్‌ పీహెచ్‌సీలలో ప్రధాన వ్యాధులకు వైద్యులు అందుబాటులో ఉంటారని, ల్యాబ్‌లు, ఫార్మసీ, ఆప రే షన్‌ విధానం, లేబర్‌ రూము వంటి సదుపాయాలు ఉంటాయని తెలిపారు రాష్ట్రంలో 95 శాతం యూపీ హెచ్‌సీల నిర్మాణం పూర్తయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.62 లక్షల టిడ్కో ఇళ్లను నిర్మించామని, ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా లబ్ధిదారులకు బ్యాంకు రుణాలను ఇప్పించి సుమారు లక్షన్నర మందికి ఇళ్లను స్వాధీనం చేశామని చెప్పారు. టిడ్కో సముదాయాల్లో మౌలిక వసతుల కల్పన పనులు పూర్తయిన తరువాత లబ్ధిదారులకు అందజేస్తా మని తెలిపారు. కార్యక్రమంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుమయాఖాన్‌, నగర పాలక సంస్థ కమిషనరు శారదాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising