ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పడిపోయిన పత్తి ధర

ABN, First Publish Date - 2022-12-12T00:15:21+05:30

పంట దిగుబడితో తల్లడిల్లిపోతున్న రైతులకు పండిన పంట కూడా సరైన గిట్టుబాటు ధర లేకపోవటంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు.

మినీలారీలో తరలిస్తున్న పత్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాచేపల్లి, డిసెంబరు 11: పంట దిగుబడితో తల్లడిల్లిపోతున్న రైతులకు పండిన పంట కూడా సరైన గిట్టుబాటు ధర లేకపోవటంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. దాచేపల్లి మండలంలో 5వేల హెక్టార్లలో పత్తి పంటను సాగుచేశారు. గులాబిరంగు పురుగు ఆశించటంతో పత్తిపంట తీవ్రంగా నష్టపోయారు. 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పత్తిపంట ఈ ఏడాది 5నుంచి 6 క్వింటాళ్లకన్నా రావటం లేదు. రైతన్నకు పత్తిధర తగ్గిపోవటం మరీ నిరాశకు గురిచేస్తోంది. పదిరోజుల క్రితం వరకు క్వింటా రూ.8500ల వరకు కొనుగోలు చేసిన పత్తిపంట నేడు రూ.7వేలకంటే కొనుగోలు చేయకపోవటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు కూడా తమకు ఎగుమతులకు ఆర్డర్‌ రావటంలేదని, కొనుగోలుచేసిన పత్తిని కూడా తరలించేందుకు ముందుకు రావటంలేదు. అంతేకాకుండా గతంలో 15 రోజులకు చెల్లించే పత్తి నగదు మార్కెట్‌ మందకొడిగా ఉండటంతో నెల రోజులకు వాయిదాపెట్టి కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ కేంద్రాలను ఏర్పాటుచేసి పత్తిపంటను కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-12T00:15:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising