ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Online Loan App వేధింపులకు మరో యువతి బలి

ABN, First Publish Date - 2022-07-12T19:44:46+05:30

గుంటూరు (Guntur) జిల్లా: మంగళగిరి మండలం, చినకాకానిలో దారుణం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (Guntur) జిల్లా: మంగళగిరి మండలం, చినకాకానిలో దారుణం చోటు చేసుకుంది. లోన్ యాప్ (Loan App) నిర్వాహకుల వేధింపులు భరించలేక ప్రత్యూష (Prathyusha) అనే వివాహిత ఆత్మహత్య (Suicide) చేసుకుంది. అయితే ఆత్మహత్యకు ముందు భర్తకు సెల్పీ వీడియో (Selfie video) పంపించింది. ఆన్‌లైన్ (Online) లోన్ యాప్ ద్వారా రూ. 20 వేలు తీసుకున్నానని, ఆ డబ్బులు తిరిగి కట్టినప్పటికీ లోన్ యాప్ సిబ్బంది పదే పదే ఫోన్ చేసి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనలా ఎవరూ ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకోవద్దని సెల్ఫీ వీడియో ద్వారా తెలిపింది. తన కుటుంబం.. తల్లీ, తండ్రీ, భర్త తనను క్షమించాలని కోరింది. కుటుంబం పరువు పోతుందని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రత్యూష పేర్కొంది.


తాను తీసుకున్న రూ. 20వేలు తిరిగి చెల్లించినా.. ఇంకా డబ్బులు కట్టాలంటూ తన కుటుంబసభ్యులు, బంధువులకు  లోన్ యాప్ నిర్వాహకులు మెసేజ్‌లు పెట్టారని ప్రత్యేష పేర్కొంది. ఈ విషయమై కొంతమంది బంధువులు కూడా తనను అడిగారని తెలిపింది. సోమవారం ఉదయం 7 గంటలలోపు డబ్బులు కట్టకపోతే న్యూడ్ ఫోటోలు కుటుంబసభ్యులు, బంధువులకు పంపుతామని బ్లాక్ మెయిల్ చేశారని, ఈ అవమానం ఇక తాను భరించలేనని సెల్ఫీ వీడియో ద్వారా తన బాధ నంత చెబుతూ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రత్యూష ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  

Updated Date - 2022-07-12T19:44:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising