ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కుబడిగానే

ABN, First Publish Date - 2022-07-05T06:03:13+05:30

నాడు నేడుతో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీటవేస్తున్నది. అయితే ఆ పనులు మొక్కుబడిగానే జరుగుతున్నాయి.

నరసరావుపేట మండలంలోని రావిపాడు కాలనీలో స్కూల్‌లో పారంభం కాని పనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాడునేడు పనులపై నిర్లక్ష్యం

580 పాఠశాలల్లో మాత్రమే పనులు 

417 పాఠశాలల్లో ఒక్క పని చేపట్టని వైనం

మొత్తం 4066 పనులకు 22.31 శాతమే పురోగతి

ఒక వైపు పనులు.. మరోవైపు స్కూల్స్‌ ప్రారంభంతో ఇక్కట్లే

 

నరసరావుపేట, జూలై 4: నాడు నేడుతో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీటవేస్తున్నది. అయితే ఆ పనులు మొక్కుబడిగానే జరుగుతున్నాయి. జిల్లాలో రూ.206.54 కోట్లు నిధులు కేటాయించి రెండో విడతల్లో 997 పాఠశాలల్లో పనులు మంజూరు చేశారు. ఈ పనులు చేపట్టడం, పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని క్షేత్రస్థాయిలోని పరిస్థితులను చూస్తే తెలుస్తోంది. జిల్లాలోని అనేక పాఠశాలల్లో నాడునేడు పనులు జరుగుతున్నాయి.  మంగళవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ పరిస్థితుల్లో బడులకు వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఏ పాఠశాలలో కూడా ఒక్క పని కూడా పూర్తికానట్లు విద్యా శాఖ నివేదికలు తెలియజేస్తున్నాయి. 997 పాఠశాలలకు 580 పాఠశాలల్లో పనులు ప్రారంభించగా 417 పాఠశాలల్లో ఒక్క పని కూడా చేపట్టలేదు. పాఠశాలలు ప్రారంభమయ్యే లోగా పనులు పూర్తి చేసి, అన్ని వసతులు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది. పనుల నిర్వహణపై ఎన్ని సార్లు సమీక్షలు నిర్వహించినా అధికారులు అలసత్వాన్ని వీడలేదు.


నాలుగు శాఖల్లోనూ అదే పరిస్థితి

పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో భాగంగా నాడు నేడు పనులకు సంబంధించి నాలుగు ప్రభుత్వ శాఖలకు పనులను అప్పగించారు. అయితే ఏ శాఖ కూడా తన పరిధిలోని పనులు పూర్తి చేయడంపై శ్రద్ధ చూపడంలేదు. మున్సిపాల్టీల పరిధిలోని పాఠశాలల్లో పబ్లిక్‌హెల్త్‌, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో పంచాయతీరాజ్‌, ఏపీఈడబ్ల్యూఐడీసీ, సమగ్ర సర్వశిక్ష శాఖ అభియాన్‌ శాఖల పర్యవేక్షలలో పనులు చేపట్టాలి. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్‌, తాగునీటి వసతి, పర్నీచర్‌, మేజర్‌, మైనర్‌ మరమ్మతులు, అదనపు తరగతి గదులు, ప్రహరిల నిర్మాణం, గ్రీన్‌చాక్‌ బోర్డులు, ఇంగ్లీషు ల్యాబ్‌లు, భవనాలకు రంగులు తదితర పనులు చేపట్టాలి. 997 పాఠశాలల్లో 4066 పనులను గుర్తించారు. ఈ పనుల్లో 907 పనులు అంటే 22.31 శాతం మాత్రమే పురోగతిలో ఉన్నాయి. 3159 పనులు అసలు ప్రారంభమే కాలేదని సంబంధిత శాఖల నివేదికలు తెలియజేస్తున్నాయి. పురోగతిలో ఉన్న పనులకు ఇప్పటి వరకు రూ.9.46 కోట్లు ఖర్చు చేశారు. నిధుల వినియోగం 4.58 శాతంగా నమోదు చేశారు. తాగునీటి వసతి పనులు పూర్తి కానట్లు నివేదికల ఆతధారంగా తెలుస్తోంది. 336 మరుగుదొడ్ల బ్లాక్స్‌ నిర్మాణాలు, తాగునీటి వసతికి సంబంధించి 345 పనులు నామమాత్రంగా కూడా జరగడంలేదు. పనుల్లో జాప్యానికి  సిమెంట్‌ కారణమని అధికారులు చెప్తున్నారు.  

Updated Date - 2022-07-05T06:03:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising