ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌పై నారా లోకేష్ ధ్వజం

ABN, First Publish Date - 2022-07-03T19:52:24+05:30

Amaravathi: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ కార్యకర్తలకు వలంటీర్లుగా ఉద్యోగాలిచ్చి జనం ధనం వృథా చేస్తున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ కార్యకర్తలకు వలంటీర్లుగా ఉద్యోగాలిచ్చి జన ధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు. 


వలంటీర్లకి రూ.233 కోట్లతో  సెల్‌ఫోన్లు

‘‘మా ఇంటికి వస్తే ఏం తెస్తారు?  మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు ? అనే రకం జగన్ మోహన్ రెడ్డి. జనం సొమ్ము దోపిడీ చేసేందుకు జగన్ ఆడని నాటకం లేదు.  వైసీపీ కార్యకర్తలందరినీ  వలంటీర్లుగా పెట్టుకుని.. పార్టీ కోసం పనిచేయిస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నారు. వలంటీర్లకి రూ.233 కోట్లతో సెల్ ఫోన్లు కొనిచ్చారు. వాటి రీఛార్జీల ఖర్చు ప్రజల డబ్బే.’’ అని లోకేష్ తెలిపారు.


ప్రకటనల రూపంలో సాక్షికి రూ.300 కోట్లు

‘‘మూడేళ్ల పాలనలో సర్కారు ఖజానాలో డబ్బులు లేవని ప్రజాసంక్షేమ పథకాలు ఆపేసిన ప్రభుత్వం, రూ.300 కోట్లు సాక్షికి ప్రకటనల రూపంలో ఇచ్చింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వార్డు సచివాలయాల్లో సాక్షి పత్రిక వేయించుకోవాలని హుకుం జారీ చేసి మరికొన్ని రూ. కోట్లు గుంజేశారు. మొబైల్లో  ఈ పేపర్ యాక్సెస్ వుండగా సాక్షి పత్రిక వేయించుకోవాలని నెలకి రూ.5.32 కోట్లు జగన్ ఆర్డర్ ఇచ్చేశారు. అంటే ఏడాదికి 63.84 కోట్లు. ’’ అని నారా  లోకేష్ వివరించారు.

Updated Date - 2022-07-03T19:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising