ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాగ్రత్తలతో మిర్చిని కాపాడుకోవచ్చు

ABN, First Publish Date - 2022-12-15T00:41:46+05:30

ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న మిర్చి పంటలను సరైన మోతాదులో మందులు వాడి సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే కాపాడుకోవచ్చునని జిల్లా ఉద్యాన శాఖాధికారి సుజాత తెలిపారు.

మిర్చి పంటలను పరిశీలిస్తున్న జిల్లా హార్టికల్చర్‌ అధికారి సుజాత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హార్టికల్చర్‌ జిల్లా అధికారి సుజాత

ప్రత్తిపాడు, డిసెంబరు 14: ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న మిర్చి పంటలను సరైన మోతాదులో మందులు వాడి సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే కాపాడుకోవచ్చునని జిల్లా ఉద్యాన శాఖాధికారి సుజాత తెలిపారు. ప్రత్తిపాడు, కాకుమాను మండలాల్లో దెబ్బతిన్న మిర్చి పైర్లను బుధవారం ఆమె పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి తగు సూచనలు చేశారు. ఆమెతో పొన్నూరు ఉద్యాన అధికారి ఉష పాల్గొన్నారు.

ఉరకెత్తిన పొలాల్లో మొక్కలు వెంటనే తేరుకోవడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 10 గ్రాముల పంచదార కలిపిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

మొక్కలు వడబడి, తలలు వాల్చినట్లయితే లీటరు నీటికి 5 గ్రాము ల మెగ్నీషియం సల్ఫేటు కలిపిన ద్రావణం పిచికారి చేయాలి. ఇనుప ధాతులోపంతో మొక్కలు కాలిపోయినట్లు కనబడితే 10 లీటర్ల నీటికి 50 గ్రాముల అన్నభేదితో పాటు ఒక నిమ్మచెక్క రసం కలిపి పిచికారి చేయాలి.

కాపుతో ఉండి వాలిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొదళ్ల చుట్టూ మట్టిని ఎగదోయాలి.

పై పాటుగా ఎకరానికి అదనంగా 30 కిలోల యూరియా 15 కిలోల పొటాష్‌, 200 కిలోల వేపపిండి వేయాలి. మొక్కలు తేరుకున్న తరువాత స్థూల పోషకాల మిశ్రమాన్ని (5 గ్రాములు లీటరు నీటికి), సూక్షపోషకాల మిశ్రమాన్ని (2.5 గ్రాములు లీటరు నీటికి) ఒక దాని తరువాత వారం రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు పిచికారి చేయాలి.

నేల అదునుకు వచ్చిన వెంటనే గొర్రువేసి అంతరకృషి చేసినట్లయితే వెంటనే ఆరుతుంది.

వేరుకుళ్లు ఆశించిన చేలలో కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 30 గ్రాములు లేదా కార్భండిజమ్‌ 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్లలో పోయాలి.

కాయకుళ్లు, కొమ్మ ఎండు తెగులు వ్యాప్తి చెందకుండా 1 మి.లీ ప్రోపికోనజోల్‌ లేదా 0.5 మి.లీ డైఫెన్‌కోనజోల్‌ లేదా 2.5 గ్రాముల కాపర్‌ హైడ్రాక్సైజడ్‌ లేదా 2.5 గ్రాముల సాఫ్‌ మందులను లీటరు నీటికి కలిపి ఒకటి మార్చి ఒకటి వారం రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు పిచికారి చేయాలి.

పంట నాశించే వివిద రకాల గొంగళి పురుగుల నివారణకు క్లోరిఫైరిఫాస్‌ 2.5 మి.లీ, లేదా ఆసిఫేట్‌ 1.5 గ్రాముల లేదా నొవాల్యురాన్‌ 0.75 మి.లీ వంటి కీటక నాశిని మందులను పిచికారి చేయాలి.

Updated Date - 2022-12-15T00:41:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising