ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యశ్రీ సిబ్బంది సేవలు ప్రశంసనీయం

ABN, First Publish Date - 2022-05-16T05:25:11+05:30

కొవిడ్‌ సమయంలో ఆరోగ్యశ్రీ సిబ్బంది అందించిన సేవలు ప్రశంసనీయం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

మంత్రి మేరుగ నాగార్జునకు వినతిపత్రం అందజేస్తున్న ఆరోగ్యశ్రీ టీమ్‌లీడర్స్‌, ఆరోగ్యమిత్రలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేరుగ నాగార్జున

గుంటూరు(తూర్పు), మే15: కొవిడ్‌ సమయంలో ఆరోగ్యశ్రీ సిబ్బంది అందించిన సేవలు ప్రశంసనీయం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఏసీ కళాశాల ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ భవన్లో ఆదివారం వైఎస్సార్‌ ఆరోగ్య టీమ్‌ లీడర్స్‌, ఆరోగ్య మిత్రల ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర స్థాయి సదస్సు నిరర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సిబ్బంది న్యాయమైన కోర్కెలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు.    అనంతరం ఆరోగ్యశ్రీ సిబ్బంది తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ నాయకులు కె.సంపత్‌కుమార్‌, నీలిమాదేవి, బుజ్జి, నాగేశ్వరరావు, కె.అప్పారావు, ఏసురత్నం, ప్రశాంత్‌, ఆషా, రత్నకుమార్‌, అరుణ్‌కుమార్‌, శ్రీలత, శ్రీను, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-05-16T05:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising