మహిళలకు ఉపయుక్తం
ABN, First Publish Date - 2022-12-16T00:32:43+05:30
ఇటీవల మహిళల్లో పాటు రొమ్ము క్యాన్సర్ బాధితులు కూడా గణనీయంగా పెరుగుతున్నారు.
జీజీహెచ్‌లో త్రీజీ డిజిటల్ మెమోగ్రామ్ పరికరం
నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో ఏర్పాటు
రొమ్ము క్యాన్సర్ ముందే గుర్తించే అవకాశం
గుంటూరు(జీజీహెచ్), డిసెంబరు 15: ఇటీవల మహిళల్లో పాటు రొమ్ము క్యాన్సర్ బాధితులు కూడా గణనీయంగా పెరుగుతున్నారు. ముందస్తుగా అవగాహన లేకపోవడం, వ్యయాన్ని భరించలేక ఇంకొందరు దీనిపై అశ్రద్ధ చేస్తున్నారు. అటువంటి వారందరికోసం జీజీహెచ్‌లోని నాట్కో సెంటర్‌లో డిజిటల్ త్రీజీ మెమోగ్రామ్ పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యాన్సర్ సాధారణంగా వారసత్వంగా రాదు. అయితే రొమ్ము క్యాన్సర్ మాత్రం వారసత్వంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. సాధారణంగా 40 ఏళ్ల పైబడిన వారు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇటువంటి వారికోసం ఈ పరికరాన్ని ఏర్పాటు చేశారు. రొమ్ము క్యాన్సర్ అనుమానం ఉన్నవారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవచ్చు. ఈ పరికరం ద్వారా కేవలం పది నిమిషాల్లో క్యాన్సర్ రొమ్ము కణాల్లో ప్రవేశించిందీ లేనిదీ సుమారు ఏడాది ముందే గుర్తించే అవకాశం ఉంది. పరీక్షలు నిర్వహించగా వచ్చిన ఫలితాన్ని బట్టి క్యాన్సర్ ముప్పు లేనిదీ, ఉంటే ఎంత ఉన్నదీ కూడా వెంటనే వైద్యులు నిర్ధారించి తదుపరి పరీక్షలు, చికిత్సలకు వెళ్ళే వెసులుబాటు ఉంది. ఈ పరికరం రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. గడ్డిపాటి కస్తూరి దేవి, రామ్మోహనరావు, శివరామకృష్ణ సహకారంతో రూ.కోటి విలువైన ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
Updated Date - 2022-12-16T00:32:47+05:30 IST