ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ-ఫార్మ్‌ మార్కెటింగ్‌ ద్వారా లావాదేవీలు పెంచాలి

ABN, First Publish Date - 2022-07-05T06:08:38+05:30

ఈ-ఫార్మ్‌ మార్కెటింగ్‌ విధానంలో ప్రతీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో లావాదేవీల సంఖ్య పెంచాలని ఆ శాఖ రాష్ట్ర కమిషనర్‌ ప్రద్యుమ్న ఆదేశించారు.

మిర్చియార్డు పరిపాలన భవనంలో జరిగిన సమావేశానికి హాజరైన మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కెటింగ్‌ శాఖ రాష్ట్ర కమిషనర్‌ ప్రద్యుమ్న

గుంటూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఈ-ఫార్మ్‌ మార్కెటింగ్‌ విధానంలో ప్రతీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో లావాదేవీల సంఖ్య పెంచాలని ఆ శాఖ రాష్ట్ర కమిషనర్‌ ప్రద్యుమ్న ఆదేశించారు. సోమవారం మిర్చియార్డు పరిపాలన భవనంలో విజయవాడ, వైజాగ్‌ రీజియన్‌ మార్కెట్‌ కమిటీల సెక్రటరీలు, అసిస్టెంట్‌ డైరెక్టర్లతో ఆయన వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఒక్కో మార్కెట్‌ కమిటీ పరిధిలో నెలకు కనీసం రూ. 10 లక్షల విలువ చేసే లావాదేవీలు జరగాలన్నారు. ఇందుకోసం సెక్రటరీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కొంతమంది కార్యదర్శులు విధి నిర్వహణల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారని, వారిపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈ-ఫార్మ్‌ మార్కెటింగ్‌ విధానం వలన రైతులకు బహుళ ప్రయోజనాలున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో సీఈవో బీ శ్రీనివాసరావు, జేడీలు కాకుమాను శ్రీనివాసరావు, సుధాకర్‌, మిర్చియార్డు సెక్రెటరీ ఐ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-07-05T06:08:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising