ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్నాడులో పార్టీకి పూర్వ వైభవం

ABN, First Publish Date - 2022-05-18T05:29:44+05:30

పల్నాడులో టీడీపీ పరిస్థితి మెరుగ్గా ఉండటంతోపాటు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు ఎక్కువవుతోందని మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.

తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో మాట్లాడుతున్న యరపతినేని శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోకేశ్‌కు వివరించిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని 

పిడుగురాళ్ల, మే17: పల్నాడులో టీడీపీ పరిస్థితి మెరుగ్గా ఉండటంతోపాటు  వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు ఎక్కువవుతోందని మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు  యరపతినేని వివరించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో లోకేశ్‌ను ఆయన కలిశారు. ఓటర్లు టీడీపీపై నమ్మకంతో ఉన్నారన్నారు. మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించాక అక్కడి పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం వచ్చిందని, పార్టీకి  పూర్వవైభవం రానుందన్నారు.  అదే విధంగా గురజాల నియోజకవర్గంలో తాను చేపట్టిన పల్లె పిలుస్తోంది కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందన్నారు.  జూలై ఆఖరు లోపు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు.   రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్‌ స్థానాన్ని టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

  

Updated Date - 2022-05-18T05:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising