ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాపులకు తాళాలు..

ABN, First Publish Date - 2022-12-13T23:53:22+05:30

నెలల తరబడి 40 దుకాణాలు నిరుపయోగంగా ఉన్నాయి. రూ.లక్షల్లో అద్దెల రూపంలో ఆదాయం వచ్చే దుకాణాలకు తాళాలు వేసి మూలన పెట్టారు.

పురపాలక సంఘంలోనిరుపయోగంగా ఉన్న వావిలాల, యర్రం వెంకటేశ్వరరెడ్డి కాంప్లెక్స్‌లోని గదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిరుపయోగంగా 40 దుకాణాలు

సత్తెనపల్లి మున్సిపాల్టీ ఆదాయానికి గండి

సత్తెనపల్లి, డిసెంబరు 13: నెలల తరబడి 40 దుకాణాలు నిరుపయోగంగా ఉన్నాయి. రూ.లక్షల్లో అద్దెల రూపంలో ఆదాయం వచ్చే దుకాణాలకు తాళాలు వేసి మూలన పెట్టారు. పెద్దమొత్తంలో ఆదాయానికి గండి పడుతున్నా అటు అధికారులు, ఇటు పాలకుల్లో చలనం లేదు. అదేమంటే వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదనే సాకుతో తాళాలు వేశారు. సత్తెనపల్లి మున్సిపాల్టీకి సంబంధించి వివిధ సముదాయాల్లో 40 షాపులు నిరుపయోగంగా ఉన్నాయి. వావిలాల షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 10, యర్రం వెంకటేశ్వరరెడ్డి కాంప్లెక్స్‌లో 6, రాజీవ్‌గాంధీ కూరగాయల మార్కెట్‌లో 21, ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో మూడు షాపులకు ఇప్పటికే వీటికి నాలుగైదుసార్లు బహిరంగ వేలం నిర్వహించారు. బహిరంగ వేలం వేసినా పాడుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దుకాణాలను అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయం పురపాలక సంఘానికి ఉపయోగపడుతుంది. కానీ సంవత్సర కాలంగా షాపుల నుంచి అద్దెలు రావడంలేదు. దీంతో పురపాలక సంఘం రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని కోల్పోయింది. వేలంలో పాల్గొనేందుకు చెల్లించాల్సిన డిపాజిట్‌తో పాటు అద్దెలు ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకురావటం లేదని కమిషనర్‌ షమ్మీ తెలిపారు.

Updated Date - 2022-12-13T23:57:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising