AP News: సమస్యలు పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తాం: ఉద్యోగుల సంఘం నాయకులు
ABN, First Publish Date - 2022-10-08T02:07:25+05:30
Amaravathi: ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ఆర్థిక శాఖ అధికారులను కలిశారు. డీఏల చెల్లింపునకు సంబంధించిన జీవోలు అమలుకాకపోవడం, బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో సంఘం నాయకులు నవంబర్ 1 నుంచి స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘‘గతంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఇంతవరకూ అమలుకాలేదు. సెప్టెంబర్ 30లోగా సీపీఎస్‌పై నిర్ణయం తీసుకుంటామని గతంలో చెప్పారు. డీఏల చెల్లింపునకు జీవోలు ఇచ్చినా ఇంతవరకూ అమలుకాలేదు. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో క్లారిటీ ఇవ్వడం లేదు. డీఏ బకాయిలు చెల్లించకున్నా..ఉద్యోగుల ఖాతాల నుంచి ఐటీ కట్ చేశారు. పీఆర్సీ చర్చల్లో డీఏల ప్రస్తావన రాకున్నా రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని జీవోలు ఇచ్చారు. డీఏ బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని అధికారులను కోరాం. సమస్యలు పరిష్కారం కాకుంటే త్వరలోనే కలిసొచ్చే ఉద్యోగ సంఘాలతో కార్యాచరణ రూపొందిస్తాం. వచ్చే నెల ఒకటినుంచి స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తాం.’’ అని చెప్పారు.
Updated Date - 2022-10-08T02:07:25+05:30 IST